ప్రతి నెలలాగే ఈ డిసెంబర్ నెలలో కూడా అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మొబైల్ ఫోన్స్ రిలీజ్ కానున్నాయి.2022 చివరినెల అయిన డిసెంబర్ లో తమ కొత్త మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేయడానికి చాలా మొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.మరి అవేంటో ఓసారి చూద్దాం.
వన్‌ప్లస్ 11 సిరీస్
వన్‌ప్లస్ నుంచి 11 సిరీస్ రానుంది.ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంది.యాండ్రాయిడ్ లోని 13 సిరీస్ తో ఇది విడుదల కానుంది.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ వైర్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వన్ ప్లస్ 11 సిరీస్ మార్కెట్లోకి విడుదల కానుంది.
రియల్‌మీ 10 సిరీస్
రియల్‌మీ సంస్థ నుంచి 10 సిరీస్‌లో మూడు ఫోన్లు డిసెంబర్ నెలలో అందుబాటులోకి రానున్నాయి.మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్లను ఈ మొబైల్ లో వినియోగించారు.మూడు వేరియంట్లలో ఉండే ఈ సిరీస్ లో వేరియంట్‌ను బట్టి మొబైల్ రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకూ ధర ఉండే అవకాశం ఉంది.
ఐకూ 11 సిరీస్
![Telugu India, Indian, Tech-Latest News - Telugu Telugu India, Indian, Tech-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2022/12/India-mobile-phones-Indian-market-tech-news-oneplus-11-vivo-iqoo-11.jpg)
ఐకూ నుంచి 11 సిరీస్ మార్కెట్లోకి డిసెంబర్ మొదటి వారంలోనే రానుంది.లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో వినియోగించారు.వెనక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తో మొబైల్ ఫోన్లు రానున్నాయి.
వివో ఎక్స్ 90 సిరీస్
![Telugu India, Indian, Tech-Latest News - Telugu Telugu India, Indian, Tech-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/12/Indian-market-tech-news-oneplus-11-vivo.jpg )
వివో ఎక్స్ సిరీస్ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్లతో సరికొత్త మొబైల్స్ రిలీజ్ కానున్నాయి.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్న ఈ మొబైల్స్ ధర రూ.45 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.
షావోమి 13 సిరీస్
షావోమి నుంచి 13 సిరీస్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి.స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించిన ఈ మొబైల్స్ లో 50 ఎంపీ లైకా లెన్స్‌తో కూడిన కెమెరా ఉంది.