Allu Arjun Sukumar : పుష్ప 2 ఆగిపోయింది.. అదే కారణం అంటూ సోషల్ మీడియాలో వైరల్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది గత సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కించుకున్న పుష్ప సినిమా కి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Pushpa 2 Movie Shooting Stopped Due To Pushpa , Pushpa 2 Movie , Allu Arjun, Fi-TeluguStop.com

పుష్ప 2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది.కథ ఎప్పుడో రాసుకున్నప్పటికీ కొన్ని కారణాల పూర్తి గా కథ ను మార్చేశారు.

పుష్ప 2 కథ ను ఇప్పుడు కొత్తగా తీసుకు రాబోతున్నారు.ఎట్టకేలకు పుష్ప 2 యొక్క షూటింగ్‌ కార్యక్రమాలు షురూ అయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి.

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నట్లుగా సమాచారం అందింది.ఇంతలోనే చిత్రం కార్యక్రమాలు ఆగి పోయినట్లుగా సమాచారం అందుతోంది.

పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఆగిపోవడంకు కారణం రష్యాలో పుష్ప సినిమా విడుదల అమ్మడం అంటూ సమాచారం అందుతుంది.పుష్ప రిలీజ్ రష్యాలో.రష్యన్ భాషలో జరగబోతుంది.కనుక చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం రష్యా కు వెళ్లారు.హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందనా, దర్శకుడు సుకుమార్ తో పాటు ఇంకా పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా రష్యా కి వెళ్లారు.అక్కడ సినిమా ప్రమోషన్ కోసం పలు ప్రీమియర్ షో లకు హాజరు కాబోతున్నారు.

అంతే కాకుండా పలు మీడియా సమావేశాల్లో కూడా పాల్గొంటారు.అక్కడ సినిమా భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందో అనేది చూడాలి.

రష్యన్‌ పుష్ప ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.మరి కలెక్షన్స్ ఆ స్థాయిలో వస్తాయా అనేది చూడాలి.

షూటింగ్  ఆలస్యం అవుతూ ఉన్నా కూడా సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Allu Arjun and Rashmika in Russia Pushpa Movie

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube