ఏపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ మరియు అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన మరి కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం తరలింపుకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పంపితే తప్పేముందని ప్రశ్నించారు.అలానే, అంకబాబు అరెస్ట్ విషయంలో సీఐడీ అధికారులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించలేదని ఆరోపించారు.
అరెస్టులతో జర్నలిస్టులను నియంత్రించాలని చూస్తున్నారా అని నిలదీశారు.