టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ28 అనే వర్క్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలను పెట్టుకున్నారు.అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ విడుదల అవుతూ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.
ఇదిలా ఉంటే మహశ్ బాబు కూడా ఫ్యాన్స్ ను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ 28 సినిమా కోసం మహేష్ పూర్తిగా తన లుక్ ను మార్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ వరుసగా న్యూ లుక్ లో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వదులుతూ ఆశ్చర్య పరుస్తున్నారు.ఇప్పటికే పలు ఫోటోలను షేర్ చేయగా తాజాగా మరొక ఫోటోని కూడా షేర్ చేశారు మహేష్ బాబు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ఫోటోలో మహేష్ బాబు స్కైబ్లూ టీషర్ట్ ధరించారు.కాగా ఆ ఫోటోలో స్టైలిష్ లుక్ లో కనిపించడంతోపాటుగా మరింత ఎక్కువగా కనిపిస్తున్నారు మహేష్ బాబు.
ఇక ఆ ఫోటోలను చూసినా ఘట్టమనేని అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
మహేష్ బాబు కూడా ఆ ఫోటోలను షేర్ చేస్తూ రెస్ట్ అండ్ రీచార్జ్ అంటూ క్రేజీ అంటూ క్యాప్షన్ ని కూడా జోడించారు.ఈ లుక్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం మహేష్ కొంచెం గడ్డం మీసాలు బాగానే పెంచినట్టుగా ఫోటోలను బట్టి చూస్తే అర్థమవుతుంది.