ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ కు ముందే ట్విట్టర్ లో బాయ్ కాట్ ట్రెండింగ్ అమలులోకి వస్తోంది.ముఖ్యంగా ప్రముఖ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ట్రెండింగ్ చేస్తుండటం గమనార్హం.
అయితే బాయ్ కాట్ ట్రెండింగ్ డబ్బులు తీసుకుని చేస్తున్నారని స్వర భాస్కర్ సంచలన కామెంట్లు చేశారు.బాయ్ కాట్ ట్రెండింగ్ వెనుక రహస్య ఎజెండా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల రక్షాబంధన్, లాల్ సింగ్ చడ్డా సినిమాలు భారీ స్థాయిలో నష్టపోయాయి.
సెలబ్రిటీలు గతంలో ఎప్పుడో పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను పట్టుకుని బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తుండటం గమనార్హం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా బాలీవుడ్ సినిమాల విషయంలో ఈ విధంగా జరుగుతుండటంతో ఈ బాయ్ కాట్ ట్రెండింగ్ వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ బాయ్ కాట్ ట్రెండింగ్ వెనుక బలమైన శక్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను బాయ్ కాట్ ట్రెండింగ్ ద్వారా టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.
కొన్ని సినిమాలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.కొన్ని అవకాశవాద రాజకీయ శక్తులు సైతం ఈ కుట్ర వెనుక ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.త్వరలో స్వర భాస్కర్ నటించిన జహాన్ చర్ యార్ థియేటర్లలో విడుదల కానుంది.
త్వరలో ప్రజలకు నిజానిజాలు అర్థమవుతాయని ఆమె కామెంట్లు చేశారు.స్వర భాస్కర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇప్పటికే నష్టాల్లో ఉన్న సినిమా ఇండస్ట్రీ బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉండటం గమనార్హం.