గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.
అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.
ఈ మధ్యనే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో అతిథి పాత్రలో మెరిసింది.ఈ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషించి నటిగా తనని తాను మరోసారి నిరూపించుకుంది.
ఇక ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఉన్నాయి.తాజాగా ఈమె నటించిన గుడ్ బై సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో కూడా రష్మిక డీ గ్లామర్ రోల్ లోనే నటిస్తుంది అని ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్ధం అవుతుంది.ఇప్పటికే డీ గ్లామర్ లుక్ తో పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా వ్యాప్తంగా మెప్పించింది.
ఇక ఇప్పుడు గుడ్ బై సినిమాలో కూడా ఈమె డీ గ్లామర్ లుక్ లోనే కనిపించనుంది.దీంతో రష్మిక ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా రష్మిక కూడా కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాను వికాస్ బెహెల్ డైరెక్ట్ చేసారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు.అలాగే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
అమితాబ్, రష్మిక తండ్రి కూతుర్లుగా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 7న విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.