రాజమౌళి తన సినిమాలు విడుదల అయిన సమయంలో అయినా కష్టపడ్డాడో లేదో కానీ.టెన్షన్ పడ్డాడో లేదో కానీ ఇప్పుడు మాత్రం రాజమౌళి కాస్త కంగారు పడుతున్నట్లుగా.
టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నాడు.అత్యంత పీక్స్ పరిస్థితిని రాజమౌళి ఎదుర్కొంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
అసలు విషయం ఏంటీ అంటే ఆయన సమర్పణలో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది.సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవుతున్నాయి.
ఆ మధ్య వచ్చిన ట్రైలర్ కి ఆమీర్ పేట్ గ్రాఫిక్స్ అంటూ ట్రోల్స్ వచ్చాయి.సినిమా చూసినా కూడా అదే పరిస్థితి.
మరీ నాసిరకం గా ఉన్న గ్రాఫిక్స్ వర్క్ ను వినియోగించిన బ్రహ్మాస్త్ర టీమ్ ఎంత వరకు సినిమా ను సక్సెస్ చేసుకుంటుంది అనేది అనుమానంగా ఉంది.రాజమౌళి సమర్పకుడు అయినందు వల్ల ఓపెనింగ్స్ ఒక మోస్తరుగా ఉండే అవకాశం ఉంది.
ఒక వేళ చిన్న తప్పిదం జరిగి సినిమా అటు ఇటు అయితే రాజమౌళి మొదటి సమర్పణ సమర్పయామీ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.రాజమౌళి ఇప్పటి వరకు ఏ సినిమా కు ఇలాంటి పని నెత్తికి ఎత్తుకోలేదు.
ఎందుకోసం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరియు సమర్పకుడిగా బాధ్యతలు తీసుకున్నాడో అర్థం కావడం లేదు అంటూ కొందరు తీవ్ర అసంతృప్తితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి అనవసరంగా ఈ సినిమా కు కమిట్ అయ్యాడు అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం భారీ మొత్తం పారితోషికం వస్తున్న కారణంగా రాజమౌళి ఓకే చెప్పి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కారణం ఏదైనా కూడా ఈ సినిమా ని రాజమౌళి సమర్పించేందుకు సిద్ధం అవ్వడం తో అభిమానులు ఒకింత బ్రహ్మాస్త్ర పై ఆసక్తిని కనబర్చుతున్నారు.