తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.ఒక్కరోజు వ్యవధిలో మూడు వందలలోపే కేసులు నమోదు అయ్యాయి.
అదే సమయంలో కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 18,791 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 291 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అదే సమయంలో మరో 396 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,446కి తగ్గింది.రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111 గా ఉందని వెల్లడించింది.