1.టీటీడీ కల్యాణమస్తు తాత్కాలిక వాయిదా
టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు జరగాల్సిన సామూహిక వివాహాల కార్యక్రమం కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా పడింది.
2.బాసర ట్రిపుల్ ఐటీ లో తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళ్ బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో కలియతిరిగారు.విద్య, భోజనం వసతి సదుపాయాలపై అధికారులను గవర్నర్ ఆరా తీశారు.
3.నేతన్న భీమా పథకాన్ని ప్రారంభించనున్న కేటీఆర్
![Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog, Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog,](https://telugustop.com/wp-content/uploads/2022/08/telangana-government-starts-nethanna-bheema-scheme-for-weavers.jpg)
నేడు తెలంగాణ వ్యాప్తంగా నేతన్న భీమా పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
4.నేటి నుంచి దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్స్
నేటి నుంచి తెలంగాణలో దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
5.ఓపెన్ స్కూల్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణ లో ఓపెన్ స్కూల్ లో చదివే అభ్యర్థులకు సంబంధిత పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు.ఈ నెల 11 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లిండానికి గడువు విధించారు.
6.నీతి అయోగ్ పై హరీష్ రావు కామెంట్స్
![Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog, Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog,](https://telugustop.com/wp-content/uploads/2022/08/telangana-minister-harish-rao-has-criticized-the-central-government-and-niti-aayog.jpg)
నీతి అయోగ్ చేసిన ప్రకటనపై టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.నీతి అయోగ్ రాజకీయ రంగరంగు పులుముకుందని హరీష్ రావు విమర్శించారు.
7.బిజెపిలో చేరిన దాసోజు శ్రవణ్
కాంగ్రెస్ కు చేసిన ఎఐసిసి అధికార ప్రతినిధి డాసోజు శ్రావణ్ బిజెపిలో చేరారు.
8.చంద్రబాబు కామెంట్స్
నేతలపై అక్రమ కేసులు బనాయి చూస్తూ ఊరుకోమని టిడిపి అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
9.పవన్ కళ్యాణ్ కామెంట్స్
![Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog, Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog,](https://telugustop.com/wp-content/uploads/2022/08/Pawan-kalyan-Accepted-Handloom-Weavers-Promotion-Challenge.jpg)
చేనేత కళాకారులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
10.నీతి అయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది.
11.నారా లోకేష్ శుభాకాంక్షలు
చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
12.కేంద్ర విద్యుత్ చట్ట సవరణపై నేడు నిరసన
పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణను నిరసిస్తూ సోమవారం ఉద్యోగులు నిరసన చేపడతామని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రకటించింది.
13.గోరంట్ల మాధవ్ ది మార్పింగ్ వీడియోనే
![Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog, Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog,](https://telugustop.com/wp-content/uploads/2022/08/Gorantla-Madhav-Morphing-Video.jpg)
గోరంట్ల మాధవ్ ఎటువంటి తప్పు చేయలేదని, బీసీలపై బురద జల్లే ప్రయత్నం చేయలేదని అది మార్పింగ్ వీడియోను వైరల్ చేశారని వైసీపీకి చెందిన కురవ సామాజిక వర్గం నేతలు విమర్శించారు.
14.చిన వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యాంసుందర్ రావు, జస్టిస్ టి రాజశేఖర్ రావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
15.తిరుమల సమాచారం
![Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog, Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog,](https://telugustop.com/wp-content/uploads/2022/08/Tirumala-Tirupathi-Information.jpg)
ఇవాళ శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.రేపటి నుంచి మూడు రోజుల పాటు పవిత్ర ఉత్సవాలు.అలాగే రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
16.శ్రీశైలం లో పల్లకి సేవ
నేడు శ్రీశైలం భ్రమరాంబిక శ్రీ అమ్మవారి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించనున్నారు.
17.చేనేత భవనానికి శంకుస్థాపన
నేడు చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన చేనేత భవనానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.
18.మూడు రోజులపాటు వర్షాలు
నేటి నుంచి తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
19.SSLV -D1 విఫలం అధికారికంగా ప్రకటించిన ఇస్రో
![Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog, Telugu Chandrababu, Corona, Handloomweavers, Harish Rao, Isro, Ktr, Niti Aayog,](https://telugustop.com/wp-content/uploads/2022/08/satellites-no-longer-usable-after-deviation-isro-on-its-maiden-sslv-mission.jpg)
ఎస్ ఎస్ ఎల్వి ఢీ 1 ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,550
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,870
.