ఇటీవల కాలంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది.మహానటి సినిమా ద్వారా తెలుగులో సరాసరి తెలుగు సినిమా మొదటిసారిగా చేసిన దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి క్క్రేజ్ అయితే దక్కించుకున్నారు.
ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత ఆయన తన సినిమాలన్నింటినీ కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు.ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సీతారామమ్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.
మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం ప్రేక్షకులు అభిమానాన్ని సంపాదించుకుంది.
దుల్కర్ సల్మాన్ కి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు యావత్ సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ మలయాళీ హీరో స్టాంపు నుంచి బయటపడి ప్రస్తుతం ఎదుగుతున్నాడు.అయితే ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ సినిమాలో సీత పాత్రలో నటించినా మృనాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతున్నారు.
ఈ సినిమాలో నటించడం అమే లక్కుగా అంతా భావిస్తున్నారు.సోషల్ మీడియాలో సైతం ఆమెకు మంచి మార్కులు వేస్తున్నారు.

నిజానికి మృణాల్ ఠాకూర్ కన్నా ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా అయిన తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని రోజుల ముందుగా పూజ హెగ్డే కరోనా బారిన పడటంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చింది.అప్పటికే సినిమాకి సంబంధించిన బడ్జెట్ బాగా పెరగడంతో చేసేదేమీ లేక చిత్ర యూనిట్ మృణాల్ ని హీరోయిన్ గా తీసుకొని సినిమాని ముగించింది.ఈ సినిమా కు హిట్ టాక్ రావడంతో మంచి లవ్ స్టోరీని పాపం పూజా మిస్ అయిందని అనుకోవాలి.
ఇటీవల ఆమె నటించిన రాదే శ్యామ్ లాంటి లవ్ స్టోరీ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఆమె కొంచెం డీలా పడింది.ఇప్పుడు ఇలాంటి ఒక మంచి సినిమా ఆమె చేయి జారిపోవడంతో మరొక మూవీ ఆమె ఖాతాలోంచి వెళ్ళిపోయింది.
పూజా హెగ్డే ఈ సినిమాలో నటించిన ఏది ఉంటే సినిమా మరొక లెవెల్ లో ఉండేది అంతేకాదు పూజా కి కూడా తన కెరీర్ మరొక స్టేజ్ కి పెరిగేది.