పెట్స్ అంటే ఎవరి ఇష్టం ఉండదు.మనిషి దైనందిత జీవితంలో కొన్ని పెంపుడు జంతువులకు చోటు లభించింది.
మనిషి నుండి మనిషి దూరమైపోతున్నవేళ, కొన్ని జంతువులు వారి కుటుంబాల్లో చోటు దక్కించుకున్నాయి.వారికి ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి.
అలాంటివాటిలో ముందు వరుసలో కుక్క, పిల్లి, కుందేలు వంటి జాతులు స్థానం సంపాదించుకున్నాయి.ఇందులో కుందేలు చాలా ప్రత్యేకమైనది.
దీన్ని కేవలం ఆనందం కోసమే పెంచుకుంటూ వుంటారు.ఇంటి పరిసరాల్లో ఇవి తచ్చాడుతూ ఉంటే, పిల్లలు నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు.
ఇక నేడు సోషల్ మీడియా రాజ్యమేలుతున్నవేళ ముఖ్యంగా జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా కుందేలు వంటి కొన్ని జంతువుల చేష్టలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి.
మనసుకు ఎంతగానో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.అందుకే జంతువుల హృదయపూర్వకమైన వీడియోలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి.
ప్రస్తుతం ఓ చిన్న కుందేలు వీడియో నెటిజన్ల మనసు విపరీతంగా దోచుకుంటున్నది.ఆకులను ముద్దుముద్దుగా తింటున్న కుందేలు వీడియోకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఇకపోతే, ఈ వీడియోను ‘వైల్డ్‌యానిమల్స్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు.ఈ వీడియోలో అందమైన చిట్టి కుందేలు యజమాని ఇంటి వరండాలో కూర్చుని ఓ మొక్క ఆకులను తింటోంది.
ఈ వీడియో చాలా క్యూట్ గా ఉండడంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నది.ఇప్పటివరకూ వీడియోకు 7.3 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు అచ్చం అలాంటి కుందేలు తమకు ఉంటే బావున్ను అని కామెంట్లు చేస్తున్నారు.
మరికొంతమంది తమ ఇళ్లల్లో పెరుగుతున్న కుందేలు ఫోటోలు షేర్ చేస్తున్నారు.