న్యాచురల్ స్టార్ నాని కెరియర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా చేస్తున్న దసరా సినిమా విషయం నుంచి రోజుకొక కొత్త న్యూస్ బయటకు వస్తుంది.శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ దసరా సినిమా నాని కెరియర్ లో స్పెషల్ మూవీగా రాబోతుంది.
నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ గా ఈ మూవీ వస్తుంది.అందుకే ఈ సినిమా కోసం నాని ఎంతటి రిస్క్ అయినా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ క్రమంలో నాని సినిమా బడ్జెట్ కి పనికి వస్తుందని తన రెమ్యునరేషన్ సగమే తీసుకుంటున్నాడట.
ప్రస్తుతం సినిమాకు ఆరు నుంచి 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాని దసరా సినిమాకు మాత్రం సగం రెమ్యునరేషన్ తోనే సినిమా చేస్తున్నాడట.
మిగతా మొత్తం సినిమా పూర్తయ్యాక బిజినెస్ జరిగాక తీసుకుంటానని అన్నారట.నిర్మాతకు హీరోల రెమ్యునరేషన్ భారం అవుతుంది.అయితే స్టార్ హీరోల సినిమాలకు వారి రెమ్యునరేషనే ఎక్కువ మొత్తం అవుతుంది.అసలు సినిమాకు అయ్యే బడ్జెట్ చాలా తక్కువగానే ఉంటుంది.
అందుకే నాని దసరా సినిమా ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుందని తను తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ లో సగం మాత్రమే తీసుకుంటున్నాడట.ఇది నిజంగా సినిమా మీద నానికి ఉన్న కమిట్ మెంట్ అని చెప్పొచ్చు.
పీరియాడికల్ మూవీగా తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న దసరా సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నటించేందుకు కీర్తి సురేష్ కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది.
ఈమధ్యనే చిన్నా, సర్కారు వారి పాట సినిమాలతో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చిన కీర్తి సురేష్ దసరా మూవీ మీఎద కూడా చాలా హోప్స్ పెట్టుకుంది.
నాని కంప్లీట్ మాస్ మేకోవర్ తో వస్తున్న దసరా సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
ఈ మూవీని ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.