రాష్ట్రంలో పాలిసెట్ – 2022 విడుదల చేసిన ఫలితాలలో 91.84 శాతం నమోదు అయి 1లక్ష 20 వేల 866 మంది విద్యార్థులు అర్హత సాధించిన్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్ తెలిపారు.వీరిలో 82,273 మంది బాలురు పరీక్షలు హాజరు కాగా 74,510 మంది, 49,335 బాలికలు హాజరు కాగా 46,356 మంది అర్హత సాధించిన్నట్లు మంత్రి వివరించారు.బాలురు బాలికలు కలిపి మొత్తంగా 91.84 ఉత్తీర్ణత శాతంగా నమోదు అయిందన్నారు.ఫలితాలలో అల్లూరి సీతారామరాజు జిల్లా 98.39 శాతంతో ప్రధమ స్థానంలో నిలించిందని, 97.79 శాతం బాలికలు, 98.80 బాలురు ఉత్తీర్ణత శాతంలోను కూడా అల్లూరి జిల్లానే ప్రధమ స్థానంలో నిలించిందని మంత్రి తెలిపారు.
ఫలితాలలో 119 మార్కులతో తూర్పుగోదావరికి చెందిన చెల్లా సత్యహర్షిత ప్రధమ ర్యాంక్, 119 మార్కులను సాధించి కాకినాడ జిల్లాకు చెందిన అల్లూరి హెచ్ఎస్ నిహన్త ద్వితీయ ర్యాంక్, 118 మార్కులతో కాకినాడ జిల్లాకు చెందిన తెంకని సాయి భవ్యశ్రీలు తృతీయ ర్యాంకు సాధించిన్నట్లు మంత్రి తెలిపారు.గత మూడు సంవత్సరాలుగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాలో ఉత్తీర్ణత శాతం ఘననీయంగా పెరుగుతుందన్నారు.2018 సంవత్సరంలో 80.19 ఉత్తీర్ణత శాతం నమోదు కాగా ఈ ఏడాది 91.84 శాతం పెరుగుతుందని తెలిపారు.జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2021-22లో 85,790 మంది విద్యాదీవెన లబ్దిదారులకు 75.71 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు.84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 500 డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేసి వర్చువల్ విధానంలో విద్యా బోధన అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థులలో స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించి ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ముంబై ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుని అన్లైన్ క్లాస్ ద్వారా ఉత్తమ శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.కళ్యాణ దుర్గం, కుప్పం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్బీఏ) గుర్తింపు పొందాయని మరో 16 ప్రభుత్వ కళాశాలలు త్వరలో గుర్తింపు పొందనున్నాయని మంత్రి వివరించారు.
విద్యార్థులుకోర్సులు పూర్తి చేసిన వెంటనే దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్య విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చామన్నారు.వీటిలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, త్రీడి గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ మల్టీమీడియాతో పాటు ఈ ఏడాది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్ వర్కింగ్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు.
హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ కేర్, పారామెడికల్ రంగాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాంకేతిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించడం జరిగిందన్నారు.
ప్రతీ నియోకవర్గ స్థాయిలో స్కిల్ హబ్, జిల్లా స్థాయిలోసెంటర్అఫ్ ఎక్స్లెన్స్, వీటిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.భారత ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ ప్రపంచంలోని విద్యార్థులతో పోటీ పడే విధంగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికి అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే మెదటి స్థానం సాధించడం జరిగిందన్నారు.ప్రధమ స్థానాన్ని పొందిన విద్యార్థులు కూడా పేద వర్గానికిచెందిన వారేనన్నారు.విద్యా రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఏకాగ్రతతో చదివితే ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుందని ఇందుకు పేదరికం అడ్డురాదని విజయం సాధించిన విద్యార్థులు నిరూపించారని మంత్రి అన్నారు.పాలిసెట్ 2022 ఫలితాల విడుదల కార్యక్రమంలో సిల్క్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరి సౌరబ్ గౌర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్ పోలా భాస్కర్, సెక్రటరి కె.విజయ భాస్కర్, జాయింట్ డైరెక్టర్ ఏ.నిర్మలకుమార్ప్రియ జాయింట్ సెక్రటర్లు బి.జానకిరామ్, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు