సృజనాత్మకత ఉంటే చాలు యూట్యూబర్స్ పంట పండుతోంది.వారు పెట్టే వీడియోలు భాషా భేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఇది వారికి ఆదాయాన్ని కూడా పెంచుతోంది.ఇటీవల కాలంలో ఎక్కువ మంది యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని, దాని ద్వారా ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఏదైనా ప్రాంతీయ భాషలో వారు చేసే వీడియోలు ఆ భాష వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.అయితే సబ్ టైటిల్స్ వేస్తే ఇతర భాషల వారికి కూడా వారు చేసే వీడియోలు చేరువయ్యే అవకాశం ఉంది.
ఇది యూట్యూబర్ల వీడియోలకు వ్యూస్‌ను గణనీయంగా పెంచుతుంది.కాబట్టి, మీరు మీ వీడియోలకు సబ్ టైటిల్స్ ఎలా చేర్చాలో, దాని ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది.ఇందులో ఏ భాషలో వీడియో పెట్టినా, ప్రపంచంలో ఎవరైనా చూసే అవకాశం ఉంది.అయితే వారికి యూట్యూబర్లు చేసిన వీడియోలు అర్థం కావాలంటే దానికి సబ్ టైటిల్స్ చేర్చడం తప్పనిసరి.ఫలితంగా వివిధ ప్రాంతీయ భాషలతో పాటు, విదేశీయులు కూడా ఆయా వీడియోలను చూసే అవకాశం ఉంటుంది.
దీనికి వివిధ భాషలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు.యూట్యూబ్ మీ క్యాప్షన్ ఫైల్‌ను దానంతట అదే గూగుల్ ట్రాన్స్‌లేషన్‌కు పంపుతుంది.
దీంతో విదేశాల్లో ఉండే యూట్యూబ్ వీక్షకులు ట్రాన్స్‌లేషన్ అయిన సబ్ టైటిల్స్ ఆధారంగా మీ వీడియోలను అర్థం చేసుకోగలుగుతారు.
యూట్యూబ్ వీడియోలకు సబ్ టైటిల్స్ పెట్టడం చాలా సులభం.
ఇది గూగుల్ వాయిస్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మీ వీడియో కోసం సబ్ టైటిల్స్‌ను క్రియేట్ సృష్టిస్తుంది.ఇందుకు గానూ మీ యూట్యూబ్ స్టూడియో పేజీకి వెళ్లి, మీరు సబ్ టైటిల్స్ పెట్టాలనుకుంటున్న వీడియోను ఎంచుకోవాలి.
ఆ తర్వాత యూట్యూబ్ నుంచి సబ్ టైటిల్స్ మీకు కనిపిస్తాయి.స్క్రీన్ కుడి వైపున చూస్తే “సబ్‌టైటిల్స్” అనే ఆప్షన్ కనిపిస్తుంది.అక్కడ ఆటోమేటిక్ సబ్ టైటిల్స్‌ను మీరు చూస్తారు.విండో కుడి వైపున పై భాగంలో ఎడిట్ ఆప్షన్ ఎంచుకోండి.
యూట్యూబ్ ద్వారా ఆటోమేటిక్‌గా వేరు చేయబడిన టెక్స్ట్ యొక్క వివిధ విభాగాలను ఎంచుకోండి.మీ వీడియోను ప్లే చేయండి.

ఇక్కడ మీరు స్పెల్లింగ్ తప్పులను సరిచేయవచ్చు.మీరు మీ వీడియోలో కనిపించే సబ్ టైటిల్స్ సమయాన్ని సరిచేయాలనుకుంటే వీడియో దిగువన ఉన్న బార్‌లను మీ మౌస్‌తో సర్దుబాటు చేయవచ్చు.మీరు పూర్తి చేసిన తర్వాత, పై భాగంలో కుడి వైపున కనిపించే డ్రాఫ్ట్‌ను సేవ్ చేయడానికి క్లిక్ చేయండి.మీరు ‘సేవ్ డ్రాఫ్ట్’ని నొక్కిన తర్వాత, మీ వీడియోకు సబ్ టైటిల్స్ యాడ్ అవుతాయి.
ఒక్కోసారి దీనికి కొంత సమయం పడుతుంది.తర్వాత, మీరు అప్‌డేట్ చేసిన సబ్ టైటిల్స్ సేవ్ చేసిన తర్వాత మార్పుల కోసం ఎడిట్ పేజ్‌లో క్రిందికి స్క్రోల్ చేయాలి.
ఆ తర్వాత అక్కడ కనిపించే ఆప్షన్స్‌ను బట్టి మీరు హెడ్డింగ్స్, సబ్ టైటిల్స్‌ను మార్పు చేయొచ్చు.అంతేకాకుండా వీడియో భాషను కూడా మార్చొచ్చు.