మన దేశంలో ప్రముఖులకు నల్లధనాన్ని ఎలా దాచాలో బాగా తెలుసు.సినీ ఫక్కీలో వారు దాచిన దాన్ని గాని మనం చూసినట్టైతే నోళ్లెళ్లబెట్టక మానము.
సాధారణంగా ఏ ఇంటి గోడలనైనా ఇటుకలతో నిర్మిస్తారు.కానీ అక్కడ వెండి ఇటుకలు ప్రత్యక్షమయ్యాయి.
అవును. ముంబయిలోని ఒక వ్యాపార సంస్థ కార్యాలయం గోడలో మాత్రం కోట్ల రూపాయల నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి.
వాటితో పాటుగా సుమారు 10 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు.దాంతో స్థానికంగా ఈ విషయం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.
ఇక అసలు విషయంలోకి వెళితే, ముంబై నగరంలోని నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన ‘జవేరీ బజార్’లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో భారీ ధనం దాచిన సంఘటన వెలుగు చూసింది.‘చాముండా బులియన్‘ అనే జ్వువెలర్స్ కార్యాలయంలో రాష్ట్ర GST విభాగం ఆకస్మిక దాడి చేయగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.తనిఖీల్లో భాగంగా కార్యాలయం గోడలో దాచిన 19 కేజీల వెండి ఇటుకలు, 10 కోట్లరూపాయల నగదు బయట పడ్డాయి.వెంటనే లెక్కాపత్రం లేని ఆ ధనాన్ని అధికారులు జప్తు చేసుకున్నారు.

ఇకపోతే ఇటీవల ఆ కంపెనీ లావాదేవీలను పరిశీలించిన GST అధికారులకు పలు రకాల అనుమానాలు కలిగాయి.కేవలం 3 సంవత్సరాలలోనే చాముండా బులియన్ టర్నోవర్ 23 లక్షల నుంచి 1,764 కోట్ల రూపాయలకు పెరిగిన నేపథ్యంలో వారు సదరు కంపెనీపైన ఓ నిఘా పెట్టారు.వీరు కూడా సినీ ఫక్కీలో ఓ ఆఫీసర్ ని అక్కడ నియమించారు.అతగాడు వారితో మంచి కృతజ్ఞతాభావంతో మెలగడంతో సదరు ఓనర్ అతగాడిని నమ్మి ఈ విషయాలను తెలియజేశాడు.
ఇంకేముంది కట్ చేస్తే, GST అధికారులు ఆకస్మికంగా వారిపై దాడి చేయగా ఈ తంతు బయటపడింది.