ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమాలలో కేజిఎఫ్ చాప్టర్ 2 ఒకటి.కోలార్ గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకొని మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాలో యశ్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పాలి.డైరెక్టర్ స్క్రీన్ ప్లే, యశ్ టెరిఫిక్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాకి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను అడగగా ప్రస్తుతం తను కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని వెల్లడించారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన పలువురు తప్పకుండా కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని వారి అభిప్రాయాలను తెలియజేశారు.తాజాగా రాఖీ బాయ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి ఓపెన్ అయ్యారు.

ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ కేజీఎఫ్ చాప్టర్ 2 లో నేను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొన్ని సన్నివేశాలు గురించి చర్చించుకున్నాము.అయితే ఈ సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టడం కుదరలేదు.అయితే ప్రస్తుతం ఆ సన్నివేశాల గురించి ఎలాంటి ఆలోచన లేదని యశ్ వెల్లడించారు.ఇకపోతే త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్3 ఉంటుందని ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని యశ్ తెలిపారు.
ఇక థర్డ్ పార్ట్ కేజీఎఫ్ చాప్టర్2 ను మించి ఉంటుంది.అయితే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి కాస్త ఆలస్యం అవుతుందని ఈ సందర్భంగా యశ్ వెల్లడించారు.