చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న యువ గేయ రచయిత తైదల బాపు

6 టీన్స్, ‘గర్ల్‌ఫ్రెండ్‌’,పటాస్,ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్‌, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్‌ శ్రీరాం, అధినేత, సెల్ఫీరాజా ఇలా దాదాపు 236 సినిమాల్లో దాదాపు 500కు పైగా సూపర్ హిట్ పాటలతో యువతను విపరీతంగా ఆకట్టుకుని.పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న యువ గేయ రచయిత తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్‌ 25.

 Taidala Bapu Is A Young Songwriter Entering The Film Industry , Taidala Bapu ,-TeluguStop.com

పచ్చని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని చెప్పిన తైదల బాపు పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో 2022 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన అభిమానులు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.

మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లోని సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన తైదల వెంకటి` సత్యమ్మ లు మా తల్లిదండ్రులు.

నేను విద్యార్థి దశ నుండే పాటలు రాయడం అలవర్చుకున్నాను.స్థానికంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే టైంలో ఒక టీవీ ఛానల్‌ నిర్వహించిన పాటల పోటీలకు వెళ్లినప్పుడు అక్కడ పాటలు పాడి ఫైనల్ విన్నర్‌గా నిలిచాను.

దాంతో ఇంట్లో చెప్పకుండా 1998లో హైదరాబాద్‌కు వచ్చి జానపదంలో మొదటి నుంచి పట్టు వందేమాతరం శ్రీనివాస్‌కు నేను రాసిన పాటలు పాడి వినిపించడం జరిగింది.దాంతో ఆయన సంగీత దర్శకత్వంలో పాటలు రాసే అవకాశం కల్పిస్తానన్నాడు.

అయితే తొలి సారిగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘6 టీన్స్‌’, గర్ల్‌ఫ్రెండ్‌ అనే సినిమాతో సినిమా ద్వారా గేయ రచయితగా పరిచయం అయ్యాను.ఆ సినిమాలలో ‘నువ్వేడికెళ్తి ఆడికొస్తా సువర్ణా.‘‘ప్రేమెంత పనిచేసె నారాయణ’’, లష్కర్‌ బోనాల కాడ.’వంటి సూపర్ హిట్ పాటలు నాకు మంచిపేరు తీసుకు రావడంతో నేను.వెనుదిరిగి చూసుకోలేదు.

ఆలా అంచలంచెలుగా ఎదుగుతూ ‘6 టీన్స్,నుండి మొదలుకొని ‘గర్ల్‌ఫ్రెండ్‌’,పటాస్,ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్‌, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్‌ శ్రీరాం, అధినేత, సెల్ఫీరాజా ఇలా దాదాపు 236 సినిమాల్లో దాదాపు 500కు పైగాపాటలు రాశాను.అన్ని రకాల పాటలు రాయడం నాకు ఆ దేవుడిచ్చిన వరం.2019 లో జాతీయ కళారత్న అవార్డ్ ను అందుకున్నాను.రచయితల సంఘం రాజతోత్సవ వేడుకలో చిరంజీవి,రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ గార్ల చేతులమీదుగా విశిష్ట రచనా పురస్కారాన్ని కూడా అందుకొన్నాను.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నేను రచించిన పాటలు ఉద్యమంలో చాలా స్ఫూర్తిని రగిలించాయి.

పదిమందికి సాయం చేసినప్పుడేమన జీవితానికి సార్ధకత చేకూరుతుంది అని చిన్నతనంలో నా తండ్రి చెప్పిన మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న నేను చిన్నతనం నుంచే పదిమందికి సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నాను.

ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయాన్ని అందిస్తున్నాను.కరోనా సమయంలో మంచిర్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసరాలు అందించాను.ఈ సంవత్సరం ఏప్రిల్ 25 (2022) నా పుట్టిన రోజు సందర్భంగా పచ్చని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్న పిలుపు మేరకు నా అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి మంచిర్యాల జిల్లాలో 2022వేల మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.

ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న సమాజం శ్రేయస్సు కోసం ఎంతోకొంత సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటున్నాను.రాబోయే రోజుల్లో నేను మరిన్ని మంచి పాటల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ మంచి చిత్రాలు తీయలనే తలంపుతో చిత్ర నిర్మాణ రంగంలోకి అఫుగుపెడుతున్నాను అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube