1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.దేశంలో ఎక్స్ ఈ వేరియంట్ .గుజరాత్ లో తొలి కేసు
దేశంలో తీవ్ర తగ్గుతున్న క్రమంలో కొత్తగా ఎక్స్ ఈ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.తాజాగా గుజరాత్ లో ఓ వ్యక్తికి ఎక్స్ ఈ కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
3.యూపీ సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతా హ్యాక్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ట్విట్టర్ ఖాతా శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 30 నిమిషాల పాటు హ్యాక్ అయింది.
4.బూస్టర్ డోసు సర్వీస్ చార్జి 150 మించవద్దు : కేంద్రం
బూస్టర్ డోస్ సర్వీస్ చార్జి రూ.150 మంచి వద్దని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది.
5.సీనియర్ నటుడు బాలయ్య మృతి
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.సీనియర్ నటుడు బాలయ్య ( 94) కన్ను మూసారు.
6.చంద్రబాబు బహిరంగ లేఖ
చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నేత ఆత్మహత్య పై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.కుప్పం వైసీపీ నేత పార్థసారథి ఆత్మహత్య బాధాకరమన్నారు.
7.రెండో రోజు జగన్ తో సజ్జల భేటీ
జగన్ తో రెండో రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యి అనేక అంశాల పై చర్చించారు.
8.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి పై ఫిర్యాదు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు.
9.రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ
టిఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతోందని, బ్రోకర్ల మాఫియా తో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని , భారీ ఎత్తున కమిషన్ లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ అంటూ ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
10.సిజెరియన్ చేస్తే లైసెన్స్ రద్దు
సిజేరియన్ లను అధికంగా ప్రోత్సహిస్తూ ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించి లైసెన్సులను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
11.విదేశీ విరాళాల చట్ట సవరణలు సబబే
విదేశీ విరాళాల చట్టం 2010 లోని సవరణలు సబబే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
12.నేటి నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
13.ఏపీకి కేంద్రం శుభవార్త
రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం రూ.7,183.42 నిధులను విడుదల చేసింది.
14.టెట్ పై హై కోర్ట్ తీర్పు
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) లో అర్హత సాధించిన వారు టీచర్ వృత్తిలో కొనసాగడానికి అర్హత లేదని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
15.జగన్ పై పయ్యావుల కేశవ్ విమర్శలు
నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు.ఊహల్లో బతుకుతున్న జగన్కు వాస్తవాలు అర్థమయ్యేసరికి భాష మారిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
16.ఈటెల రాజేందర్ కామెంట్స్
టిఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడి లాగా వంద తప్పులు చేసిందని, ప్రజలు టిఆర్ఎస్ ను శిక్షించి నన్ను గెలిపించారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
17.మోడీ అమిత్ షా పై కేటీఆర్ కామెంట్స్
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశం అగ్ర స్థానం లోకి దూసుకు వెళ్ళింది అంటూ ఎద్దేవా చేశారు.
18. కాంగ్రెస్ ఎంపీ ని కలిసిన హీరోయిన్
ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చేనేత వస్త్రాలను తనదైన శైలిలో ప్రోత్సహిస్తోంది.తాజాగా కొంతమంది ఇలా విద్యార్థులతో కలిసి ఆమె కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో సమావేశం అయ్యారు.
19.రజినీకి మంత్రిపదవి వద్దంటూ జగన్ కు లేఖ
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజిని కి ఇవ్వొద్దంటూ సంఘం నేతలు జగన్ కు లేఖ రాశారు.ఆమెది రజక కులం కాదని వారు పేర్కొన్నారు.
20.చరణ్ తో వర్క్ చేయాలని ఉంది .హిందీ డైరెక్టర్
రామ్ చరణ్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని హిందీ లెజెండ్ డైరెక్టర్ అబ్బాస్ మస్తాన్ ట్వీట్ చేశారు.
21.కేంద్రీయ విద్యాలయాల్లో 2,10 తరగతుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2022- 23 విద్యా సంవత్సరానికి గాను రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.