వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్ మూడు చట్టాలను ఆమోదించిన సంగతి తెలిసిందే.దీనిపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు.
ఇది రైతుల పాలిట శరాఘాతంగా మారుతుందని.వ్యవసాయ రంగం కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రైతులు రాకేశ్ టికాయత్నేతృత్వంలో ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసి ఆందోళన నిర్వహించారు.
అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభించింది.
ముఖ్యంగా యూకే, కెనడియన్ ఎంపీలు, ఎమ్యెల్యేలు ఇతర రాజకీయవేత్తలు రైతుల నిరసనకు అండగా నిలిచారు.రైతులు చేస్తున్న పోరాటానికి కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిన సంగతి తెలిసిందే.
మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు సిక్కులకు అత్యంత పవిత్రమైన గురునానక్ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఈ నేపథ్యంలో కిసాన్ ఆందోళన్ సందర్భంగా బ్రిటీష్ పార్లమెంట్‌లో చర్చించడంతో పాటు ప్రశ్నలు సంధించిన యూకేకు చెందిన భారత సంతతి ఎంపీ తన్మన్‌జిత్ సింగ్ ధేసీని వివిధ రైతు సంఘాలు ఘనంగా సత్కరించాయి.
శుక్రవారం ఫగ్వారా సమీపంలోని మౌలి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.భారతీయ కిసాన్ యూనియన్ (దోబా) నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతు నాయకులు, సంయుక్త కిసాన్ మోర్చా మద్ధతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భారత్‌లో జరుగుతున్న రైతు ఆందోళనల గురించి ఎస్‌జీపీసీ సభ్యుడు, మామయ్య పరమ్‌జిత్ సింగ్ రాయ్‌పూర్ నుంచి తన్మన్‌జిత్ వివరాలు తెలుసుకునేవారు.ఆపై బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేవారు.
అంతేకాదు రైతుల సమస్యలపై భారత విదేశాంగ మంత్రితో చర్చించేందుకు గాను 36 మంది ఎంపీలు సంతకం చేసిన లేఖను యూకే విదేశాంగ మంత్రికి అందజేయడంలో తన్మన్‌జిత్ కీలకపాత్ర పోషించారు.రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జీ చేసిన వీడియోలు వైరల్ అయినప్పడు 100 మందికిపైగా బ్రిటీష్ ఎంపీల సంతకాలతో తాను యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాసినట్లు తన్మన్‌జిత్ రైతు నేతలతో చెప్పారు.యూకే నుంచి అమృత్‌సర్, చండీగఢ్‌లకు మరిన్ని వివమాలను నడపాలని ఆయన కోరారు.రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో సేవలందించిన సిక్కు సైనికుల కోసం సెంట్రల్ లండన్‌లో స్మారక చిహ్నాన్ని నిర్మించడం వంటి అంశాలపైనా తన్మన్‌జిత్ ప్రస్తావించా
.