కౌశల్.ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు కౌశల్. బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ స్టార్ అయిపోయాడు.ఇక ప్రస్తుతం కౌశల్ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇక కౌశల్ నటిస్తున్న తాజా చిత్రం అతడు.ఆమె.ప్రియుడు.ఈ సినిమాకు ప్రముఖ రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాను శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు.
అలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమాలో హీరో సునీల్, కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.ఇక ఫిబ్రవరి 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ లకు కూడా హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్ ను విడుదల చేశారు దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్.
ఇక ఈ టీజర్ లో కౌశల్ ఆడవారి గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పాడు.
స్త్రీ ల ఔనత్యం గురించి దర్శకుడు వీరేంద్రనాథ్ రాసిన రెండు పేజీల డైలాగ్ ను కౌశల్ అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.అందువల్ల తాజాగా అందుకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు యండమూరి.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక రెండు పేజీల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పడంతో కౌశల్ పై దర్శకుడు రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ ప్రశంసల వర్షం కురిపించాడు.నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంది అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.