గత రెండు రోజుల నుంచి చిరంజీవి చేసిన వ్యాఖ్యల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా ఎవరు వ్యవహరిస్తారనే చర్చ జరుగుతోంది.చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం చాలా సమస్యలు ఉండగా ఆ సమస్యలను ఇండస్ట్రీకి చెందిన ఎవరూ పరిష్కరించలేకపోతున్నారు.అయితే తాజాగా సుమన్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం కరెక్ట్ కాదని కామెంట్లు చేశారు.
తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 44 సంవత్సరాలు అయిందని సుమన్ చెప్పుకొచ్చారు.స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదిగానని 10 భాషలలో 600కు పైగా సినిమాలలో నటించానని సుమన్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఐక్యత లేదని చెప్పడం కరెక్ట్ కాదని సుమన్ పేర్కొన్నారు.ఇండస్ట్రీలో మురళీమోహన్, కృష్ణ, కృష్ణంరాజు, మరి కొందరు సీనియర్లు ఉన్నారని సుమన్ కామెంట్లు చేశారు.
సమస్యల పరిష్కారం విషయంలో వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని సుమన్ వెల్లడించారు.రాజకీయాల గురించి మాత్రం తాను మాట్లాడనని సుమన్ అన్నారు.

అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ రేట్ల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని సుమన్ అన్నారు.సోషల్ మీడియాలో సుమన్ చేసిన కామెంట్ల గురించి చర్చ జరుగుతోంది.టికెట్ రేట్ల సమస్య త్వరగా పరిష్కారమైతే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతబడటంతో సినిమా ఇండస్ట్రీకి ఊహించని స్థాయిలో నష్టం వచ్చింది.సినిమా రిలీజ్ లు వాయిదా పడటంతో నిర్మాతలకు ఊహించని స్థాయిలో వడ్డీల భారం పెరుగుతోంది.పెద్ద సినిమాల నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
పెద్ద సినిమాల రిలీజ్ లు వాయిదా పడటంతో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల హవా కొనసాగుతోంది.