ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం అయిన టిక్‌టాక్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.త్వరలో ఈ షార్ట్ వీడియో యాప్ ఫుడ్ డెలివరీ రంగంలో కూడా అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
మొట్టమొదటిసారిగా ఈ ఫుడ్ డెలివరీ సేవలను అమెరికాలో ప్రారంభించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. టిక్‌టాక్ లో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే టిక్ టాక్ లో ఫుడ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.అలా వైరలైన ఫుడ్ వీడియోస్ లోని ఆహారాన్ని యూజర్లకు డెలివరీ చేసే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు 9To5Mac కంపెనీ నివేదించింది.
ఫుడ్ డెలివరీ సేవతో వైరల్ ఫుడ్ వీడియోలను ఇంకా పాపులర్ చేయాలనే ఆలోచనలో ఉంది.ఈ ఫుడ్‌ను టిక్‌టాక్ కిచెన్ పేరిట అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేయనుంది.
వర్చువల్ డైనింగ్ కాన్సెప్ట్‌లతో టిక్‌టాక్ కిచెన్ సేవలను అమెరికాలో 2022లో ప్రారంభించనుంది.అమెరికాలోని సుమారు 300 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.2022 చివరి నాటికి 1,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ టిక్ టాక్ కిచెన్ సేవలందించేందుకు కంపెనీ పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా టిక్‌టాక్‌లో వైరల్ అయిన ఫుడ్ వీడియోస్ మెనూను కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది.
తమ అభిమానులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు టిక్‌టాక్ ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.అయితే టిక్‌టాక్‌లోని వైరల్ అయిన వీడియోస్‌లోని ఫుడ్‌ను యూజర్లకు డెలివరీ చేసే అవకాశం ఉంది.ఇప్పటివరకు టిక్‌టాక్ లో వైరల్ అయిన ఫుడ్ వీడియోస్ లో బేక్డ్ ఫెటా పాస్తా, స్మాష్ బర్గర్, కార్న్ రిబ్స్ , పాస్తా చిప్స్ వంటి ఫుడ్ ను కస్టమర్‌లు ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించనుంది.అయితే ఇవే డిషెష్ టిక్ టాక్ కిచెన్ మెనూలో శాశ్వతంగా ఉంటాయా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.
వైరలైన ఈ ఫుడ్ డిషెస్ యొక్క క్రెడిట్ అంతా ఆయా క్రియేటర్లకు అందజేయనుంది టిక్ టాక్ యాజమాన్యం.మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.