ఎన్టీఆర్ సినిమాలో చిరును తొలగించి మోహన్ బాబుని పెట్టడానికి గల కారణం?

సాధారణంగా ఒక సినిమాలోనటించడం కోసం ఒక హీరోతో సంప్రదింపులు అయిన తర్వాత ఆ హీరోతో సినిమా తెరకెక్కించాలి.కానీ కొన్ని సార్లు కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ సమయంలో కూడా హీరో హీరోయిన్లు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మారిపోతూ ఉంటారు చిరంజీవి విషయంలో కూడా ఇలాగే జరిగింది.

 What Is The Reason For Removing The Chiranjeevi And Putting Mohan Babu In The Nt-TeluguStop.com

ఓ సినిమాలో చిరంజీవిని బుక్ చేసుకుని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చిన తర్వాత ఒక షాకింగ్ ఘటన జరిగింది.తర్వాత షూటింగ్ లో ఉండాల్సిన చిరంజీవి స్థానంలో మోహన్ బాబు ప్రత్యక్షమయ్యారు.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.

మోహన్ బాబు నటిస్తే ఆ సినిమా అంతా ఆడింది ఆ స్థానంలో చిరంజీవి గనుక నటిస్తే ఇంకా ఏ రేంజ్ కి వెల్లేదో కనిపిస్తుంది కదా.అది సీనియర్ ఎన్టీఆర్ సినిమా.అదే తిరుగులేని మనిషి.చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక సినిమా అది.

Telugu Chiranjeevi, Heroes, Mohan Babu, Sn Ntr, Tollywood-Movie

అయితే ఆ సినిమాలో మొదట చిరంజీవిని అనుకున్నారు.ఒక డ్యూయెట్ సాంగ్ కూడా నిర్ణయం అయిపోయింది.అంతకుముందు తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిరంజీవి నటించడంతో అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నారు.కొండవీటి సింహంలో చిరంజీవిని అనుకున్నా చివరికి మాత్రం మోహన్ బాబు పెట్టారు.

చిరంజీవి ఆ పాత్రని వద్దనుకున్నారా లేదంటే ఇంకేదైనా కారణమా అన్నది మాత్రం అంతుచిక్కని విషయమే.కానీ ఆ స్థానంలో మాత్రం మోహన్ బాబు నటించి తన ఇమేజ్ ను పెంచుకున్నారు.

అలా చిరంజీవి నటించాల్సిన సినిమా మోహన్ బాబు ఖాతాలోకి వెళ్లిపోయిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube