భారత ప్రభుత్వ కీలక నిర్ణయం...గగ్గోలు పెడుతున్న ఎన్నారైలు...!!!

కరోనా ప్రభావంతో అన్ని దేశాలు తమ దేశంలోకి వచ్చే వలస వాసులపై, అలాగే సొంత వాసులపై కూడా ఆంక్షలు విధించిన విషయం విధితమే.దాంతో ఎంతో మంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయారు.

 Indian Nris Confused T-visa Central Decission , Indian, Nri, Airport In America,-TeluguStop.com

ఎప్పుడెప్పుడు తమ దేశాలు రమ్మంటూ స్వాగతం చెప్తాయో అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు.ఇప్పుడిప్పుడే భారత్ పై విధించిన ఆంక్షలను ఎత్తేస్తున్న ప్రపంచ దేశాలు భారత్ లో ఉన్న తమ వాసులు కూడా వచ్చేయండి అంటూ పచ్చ జెండా ఊపేశాయి.

ఈ క్రమంలోనే భారత్ ప్రభుత్వం కూడా విదేశీయుల, స్వదేశీయుల రాకపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దాంతో భారత ఎన్నారైలు ఎన్నో నెలలుగా తమ స్వదేశానికి వెళ్ళాలని వేచి చూసిన పరిస్థితులకు తెరపడినట్టయ్యింది.

ఎంతో మంది భారత ఎన్నారైలు భారత్ లోని తమ ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్దమయ్యారు కూడా.కానీ ఈ క్రమంలో వీసాల విషయంలో భారత్ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం వారిని ఆందోళన చెందేలా చేస్తోంది.

గతంలో ఎన్నారైల కు ఇచ్చిన మల్టీ ఎంట్రీ వీసాలు చెల్లవని ప్రకటించడంతో ఎన్నారైలు ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు.

ఈ మధ్య కాలంలో ఓ భారత మహిళ భారత్ వచ్చేందుకు అమెరికాలో ఎయిర్ పోర్ట్ కు వెళ్ళిగా అక్కడి అధికారులు ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు పైగా వీసా రద్దు అయ్యిందని చెప్పడంతో ఆమె ఖంగుతిన్నారు.

సహజంగా ఆమె వీసా వాలిడిటీ 2029 వరకూ ఉంది.కానీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఆమె వీసా కాలపరిమితి అయ్యిపోయింది.

దాంతో చేసేది లేక ఆమె వెనుతిరగాల్సి వచ్చింది.అయితే ఇలాంటి వీసాలు లెక్కకు మించి ఉంటాయని వారందరి పరిస్థితి ఏంటని ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త వీసాలు తీసుకోవాలంటే తలకు మించిన భారమని పాత వీసాలు చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube