మన దేశంలో భాషపై చర్చ గత సంవత్సర కాలంలో ఏదో ఒక సందర్భంలో వివాదాస్పదమవుతూ వస్తోంది.దేశంలో హిందీ భాష మాట్లాడటం తప్పనిసరి చేస్తూ అప్పట్లో పార్లమెంటు లో బిల్లు ప్రవేశ పెడదామని కేంద్రం ప్రయత్నించినా మిగతా రాష్ట్రాలు గగ్గోలు పెట్టడమే కాకుండా ఇంకొకసారి ఈ బిల్లు ప్రవేశ పెట్టకుండా కేంద్రానికి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి ఉంది.
దీంతో హిందీ మాట్లాడటం తప్పనిసరి అనే మొండి పట్టును కేంద్రం వీడింది.అయితే తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వారణాసిలో జరిగిన “అఖిల భారత అధికార భాషా సదస్సు” లో అమిత్ షా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

మన దేశ రాజభాష అయిన హిందీ పట్ల అందరికీ మక్కువ ఉండాలని, హిందీ భాష అన్ని భాషల కంటే వైరుధ్యమని, నాకు గుజరాతీ భాష కంటే హిందీ భాష అంటేనే ఎక్కువ ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.హిందీ భాషను మనమందరం మనలో భాగం చేసుకోవాలన్నారు.అయితే అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
భారతదేశంలో ఎవరు ఏ భాష మాట్లాడాలో కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందా తమకు నచ్చిన భాష మాట్లాడే హక్కు సగటు భారతీయునికి లేదా అంటూ బీజేపీ వ్యతిరేక పక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది.స్వయం భాష అనేది మన దేశానికి హిందీ భాష అనేది ఉంది కాబట్టి దేశ ప్రజలు భాష మాట్లాడేందుకు మక్కువ చూపాలని మాత్రమే అమిత్ షా కోరారని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఏమైనా మరో సారి అమిత్ షా వ్యాఖ్యలతో భాషకు సంబంధించిన చర్చ మరో సారి రావడం గమనార్హం.