తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సీక్వెల్ సినిమాగా విడుదలైన చిత్రం కూడా పెద్ద హిట్ సాధించినట్టు చరిత్రలోనే లేదు.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి-2సినిమా కొంతమేర సక్సెస్ ను సాధించినప్పటికీ అది కూడా సీక్వెల్ మాత్రమే కాదని చెప్పవచ్చు.
అయితే ఈ అనుభవాలు అన్నింటినీ పక్కనపెట్టి మన తెలుగు దర్శకులు వరుసగా సీక్వెల్స్ చేస్తున్నారు.మరి తెలుగులో దాదాపుగా పది సినిమాలకు పైగా సీక్వెల్ గా సిద్ధమవుతున్న ఆ సినిమాలేంటో మనం తెలుసుకుందాం.
2018లో అడివి శేష్ హీరోగా నటించిన గూడచారి సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా గూడచారి 2 సినిమాను చేస్తున్నాడు అడవిశేష్.
అలాగే హీరో నాని ప్రొడ్యూసర్ గా విశ్వక్సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాకు విశ్వక్ సేన్ సీక్వెల్ గా రూపొందిస్తున్నారు.

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా గురించి మనకు తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా రూపొందుతోంది.ఈ సినిమా 2022 సంక్రాంతి బరిలో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో విడుదలైన జాతిరత్నాలు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు అనుదీప్ సీక్వెల్ మూవీ చేస్తానని ప్రకటించాడు.
వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో ఎఫ్ 2 సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.ఇక ప్రస్తుతం ఎఫ్3 అంటూ ఈ సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా 2002 ఫిబ్రవరి 25న విడుదల కానున్నట్లు సమాచారం.అలాగే నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా చేస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి.

క్రాక్‌తో బంపర్ హిట్ కొట్టిన మాస్ మాహరాజ్ రవితేజ క్రాక్-2 చేయాలనుందని కోరగా దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఓకే చెప్పాడు.మంచు విష్ణు హీరోగా సూపర్ హీట్‌గా నిలిచిన ఢీ సినిమాకు ప్రస్తుతం విష్ణు హీరోగా సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు శ్రీను వైట్ల.త్వరలోనే ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం.