సోషల్ మీడియా అంటేనే వైరల్ న్యూస్ కు లేదంటే ఫొటోలకు లేదంటే వీడియోలకు బాగా పాపులర్ అయిపోయింది ఈ నడుమ.ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరి కొన్ని మాత్రం స్ఫూర్తి దాయకంగా ఉంటాయి.
ఇలాంటి స్ఫూర్తి దాయకంగా ఉండే వీడియోలకు ఎంతలా ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే.దీనికి ఆ రేంజ్లోనే కామెంట్లు, లైకులూ వస్తుంటాయి.
నిజానికి ఏదైనా సాధించాలనే తపన మనకు ఉంటే ఎంత కష్టం అయినా ఏదో ఒక సమయంలో దాన్ని సాధించి తీరుతాం.అయితే లక్ష్యం అనేది మనుషులకేనా జంతువులకు కూడా ఉంటుంది కదా.
ఏంటి జంతువులకు లక్ష్యం ఉంటుందా అని మీరు అనుకోవచ్చు.అవును వాటికి కూడా లక్ష్యం అనేది ఉంటుంది.ఈ వీడియో చూస్తే నిజమే అంటారు కాబోలు.ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.
సాధారణంగా పిల్లి అంటే గోడల నడుస్తుంది కానీ నిలువుగా ఉండే గోడలకు పాకదన్న విషయం మనకు తెలిసిందే.కానీ ఇందులో ఓ పిల్లి మాత్రం గోడలకు ఎంచక్కా బల్లి లాగా పాకుతోంది.
దీన్ని చూస్తే నిజంగా మన కండ్లను మనమే నమ్మలేకపోతాం.గోడలు పాకాలంటే అందుకు అనుగుణంగా కాళ్లు ఉండాలి.
కానీ పిల్లి కాళ్లు మాత్రం కేవలం నిలబడటానికి ఉపయోగపడుతాయి గానీ ఇలా గోడలు పాకడానికి అస్సలు అనుకూలంగా ఉండవు.అది అందరికీ తెలిసిందే.కానీ ఈ పిల్లి మాత్రం ఎంతో శ్రమించి మరీ గోడలకు పాకేయడాడాన్ని నేర్చుకుంది.ఓ ఇంట్లో ఈ పిల్లి ఇలా గోడలు పాకుతుండడాన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా విపరీతంగా వైరల్ అయిపోతుంది.
బక్లోల్ శేఖర్ అనే ఐడీ మీద ఓ నెటిజన్ షేర్ చేయగా కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ వచ్చాయి.లేజర్ కాంతిని అనుసరిస్తూ ఆ పిల్లి గోడ పాకుతుండటం మనకు కనిపిస్తుంది.
ఇక లేజర్ లైట్ ఎక్కడ ఆగితే అక్కడే పిల్లి కూడా ఆగిపోవడం మనకు కనిపిస్తుంది.
.