బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన నటుడు పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.
ఇటు బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇకనిరుపమ్ భార్య బుల్లితెర నటి మంజుల అందరికీ సుపరిచితమే.
మొట్టమొదటిసారి చంద్రముఖి సీరియల్ లో నటించిన వీరిద్దరూ ఆ సీరియల్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది.ఇలా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక అందరు సెలబ్రిటీల మాదిరిగానే వీరు కూడా యూట్యూబ్ ఛానల్ లో మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.వీరి ఛానల్ స్టార్ట్ చేసిన వారానికి లక్ష మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.
![Telugu Tollywood, Anniversary-Movie Telugu Tollywood, Anniversary-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/10/nirupam-paritala-manjula-paritala.jpg )
ఇలా యూట్యూబ్ ద్వారా మీరు ఏ వీడియోను పోస్ట్ చేసిన కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ క్రాస్ చేస్తూ ఉండటం గమనార్హం.ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా డాక్టర్ బాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అక్టోబర్ 3వ తేదీ వీరి వివాహ దినోత్సవం కావడంతో డాక్టర్ బాబు తన భార్యకు ఎంతో ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మంజుల పరిటాలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
ఇద్దరం కొట్టుకున్నా, తిట్టుకున్నా అందులో ప్రేమ ఉంటుంది.ఇంతకన్నా నా జీవితానికి ఇంకేం కావాలి అంటూ తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.