210 రోజులకు పైగా డైరెక్ట్ గా 4 ఆటలతో ఆడిన బాలయ్య సినిమాలేంటో తెలుసా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయనే సంగతి తెలిసిందే.తాతమ్మ కల సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన బాలకృష్ణ వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుని విజయాలను సొంతం చేసుకున్నారు.210 రోజులకు పైగా డైరెక్ట్ గా 4 ఆటలతో ఆడిన చిత్రాలు బాలయ్య సినీ కెరీర్ లో నాలుగు ఉండటం గమనార్హం.ఈ హిస్టారికల్ రికార్డులను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నారు.

 Star Hero Balakrishna Rare Records With 4 Movies Details, Balakrishna, Interest-TeluguStop.com

బాలయ్య అఖండ మూవీతో సైతం ఇలాంటి హిస్టారికల్ రికార్డులను సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సమర సింహా రెడ్డి సినిమా గుంటూరులోని కృష్ణమహల్ థియేటర్ లో ఏకంగా 227 రోజులు ప్రదర్శించబడింది.బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన నరసింహ నాయుడు సినిమా ఏలూరులోని మినీ అంబికా థియేటర్ లో 275 రోజులు ఆడింది ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ ఒక్కరే కావడం గమనార్హం.

నరసింహ నాయుడు సినిమా తర్వాత కొన్నేళ్లు ఆ స్థాయి హిట్ లేని బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సింహా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు.

Telugu Daysshows, Balakrishna, Legend, Simha, Rare, Tollywood-Movie

ఈ సినిమా గోపాలపట్నంలోని మౌర్య డీలక్స్ లో ఏకంగా 210 రోజులు ప్రదర్శించబడింది.బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన లెజెండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Telugu Daysshows, Balakrishna, Legend, Simha, Rare, Tollywood-Movie

ఈ సినిమా ఎమ్మిగనూరులోని మినీ శివ థియేటర్ లో ఏకంగా 421 రోజులు ప్రదర్శించబడింది.లెజెండ్ సినిమా మరో థియేటర్ లో డైరెక్ట్ గా 4 ఆటలతో కాకపోయినా ఏకంగా 1,005 రోజులు ప్రదర్శించబడింది.టాలీవుడ్ లో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్న హీరోలలో బాలయ్య కూడా ఒకరు కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube