బిగ్ బాస్ సీజన్ 5లో నాల్గవ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది.లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వారం నామినేషన్స్ పెద్ద పెద్ద గొడవలేమి జరగలేదు కాని లోబో లవ్ స్టోరీ చెబుతుంటే ప్రియ సినిమా కథ చెబుతాడని అనడం గురించి ప్రస్థావిచి ప్రియపై అరిచాడు లోబో.
ఇక మాస్టర్ ను నామినేట్ చేయడంతో విశ్వ మీద ఫైర్ అయ్యాడు.వారిద్దరి మధ్య కొద్దిపాటి డిస్కషన్ జరిగింది.
నాల్గవ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టంట్స్ ఉండటం విశేషం.
ఈసారి నామినేషన్స్ లో ప్రియ, రవి, లోబో, కాజల్, సిరి, సన్నీ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉన్నారు.
ఒకరిద్దరు తప్ప దాదాపు హౌజ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టంట్స్ నామినేట్ అయ్యారని చెప్పొచ్చు.బిగ్ బాస్ 5లో ఇప్పటికే 3 వారాల నామినేషన్స్ లో ముగ్గురు హౌజ్ మేట్స్ బయటకు వెళ్లగా నాల్గవ వారం ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా హౌజ్ లో ఎవరు ఉంటే ఆట కరెక్ట్ గా కొనసాగుతుంది అన్న వారినే ఆడియెన్స్ ఓటు వేసి కొనసాగిస్తున్నారు. అయితే వారాలు గడుస్తున్నా కొద్ది ఆట ఆడే వారినే ఆడియెన్స్ ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.