గుర్తు తెలియని కొందరు దుండగులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.వివరాలలోకి వెళితే.
చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు గ్రామం శివారులో వై ఎస్ఆర్ వివిగ్రహం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన వారికి ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారని విచారణ చేశారు అక్కడి గ్రామస్తులు వైయస్సార్సీపి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకోవాలంటూ ఆందోళనకు దిగారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా ఈమధ్య విగ్రహాలను ధ్వంసం చేయడం ఎక్కువగా చూస్తున్నాం.విగ్రహాలను అడ్డుపెట్టుకొని ఏపీ లోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొట్లాటలకు దారితీస్తూ పార్టీల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి.
ఇదిలా ఉండగా చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు ఇలా పలు జిల్లాల్లో స్కూల్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి.అందులో భాగంగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు కొండారెడ్డి పల్లిలో స్కూల్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసు కోవడంతో వివాదం చెలరేగింది.ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.దీంతో పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.ఇలా పార్టీల మధ్య గోడవలు చలరేగుతున్నాయి.ఇందులో భాగంగానే ఒకరు పార్టీ విగ్రహ లను మరొకరు మరొక పార్టీ వారు ధ్వంసం చేస్తున్నారు.ఈ కారణంగా కొట్లాటలు ఘర్షణలకు దిగుతున్నారు.