మాజీ ముఖ్యమంత్రి మరదలు ఓ బిచ్చగత్తె..

ఈ రోజుల్లో ఓ ఎమ్మెల్యే అయితే చాలు.ఆయన పేరు చెప్పుకుని ఎంతో మంది కోట్లకు పడగలెత్తే కుటుంబ సభ్యులు ఉన్నారు.

 West Bengal Former Cm Budda Dev Battacharya Relative Begging, Cm Buddhadev Bhatt-TeluguStop.com

ఎమ్మెల్యే వెంట తిరిగే బలగం ఉంది.అంతా కలిసి అందినకాడికి దండుకోవడమే.

అసలు టార్గెట్.ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.

మళ్లీ సారి గెలుస్తారో తెలియదు.అందుకే అవకాశం వచ్చినప్పుడే తరతరాలకు సరిపడ సంపాదించుకోవాలి.

కూసోని తిన్న కరగని రీతితో డబ్బు పోగెయ్యాలి.కానీ ఇందుకు కొందరు మినహాయింపు.

తాజాగా ఓ మహిళ గురించి వెలుగులోకి వచ్చిన వార్త.అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇంతకీ ఆమె ఎవరు.? ఎందుకు తన కథ సంచలనంగా మారింది? అనే విషయాలను తెలుసుకుందాం.

బుద్ధదేవ్ భట్టాచార్య. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి.ఒక్కసారి కాదు.పలుమార్లు సీఎం పీఠాన్ని అధిరోహించాడు.10 ఏండ్ల పాటు పాలనా పగ్గాలు తన చేతిలో పట్టుకున్నాడు.కానీ ఆయన మరదలు పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

భట్టాచార్య భార్య చెల్లి ఇరా బసు.నిజానికి తన బావ ముఖ్యమంత్రి కాబట్టి ఎంతో ఉన్నతంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంది.కానీ తను అలాంటి జీవితాన్ని వద్దు అనుకుంది.తన కేరాఫ్ అడ్రస్ ఫుట్ పాత్ గా మార్చుకుంది.డన్లాప్ లోని రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ ఈమె అడ్డా.పక్కన ఉన్న షాపుల వాళ్లు తినడానికి ఏమైనా పెడితే తింటుంది.

అక్కడే పడుకుంటుంది.

Telugu Beggar, Cmbudda, Ira Basu, Ira Basu Path, Bengal Cm, Bengal, Sister-Lates

పోనీ ఈమెకు చదువు రాదు అన్నట్లు కాదు.వైరాలజీలో పీహెచ్డీ చేసింది.ఇంగ్లీష్, బెంగాళీ భాషలు చక్కగా మాట్లాడుతుంది.

స్టేట్ లెవల్ టేబుల్ టెన్నిస్, క్రికెట్ ప్లేయర్.గతంలో టీచర్ గా పనిచేసింది.2009లో పదవీ విరమణ చేసింది .ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందో తెలియదు.ఎక్కడ బతుకుతుందో తెలియదు.ఎవరికీ తన గురించి చెప్పుకోదు.

కానీ తను ఎవరో అక్కడున్న వాళ్లకు తెలుసు.కానీ వారు సాయం చేస్తామని చెప్పినా వద్దు అంటుంది.

బిచ్చగత్తెలాగే ఉంటుంది.చాలా కాలంగా అలాగే జీవితాన్ని గడుపుతుంది.

కానీ సడెన్ గా ఆమె వార్తల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఇండియా టుడే రిపోర్టర్ ఆమె జీవితం గురించి ఓ వార్త రాశాడు.ఆ వార్త పలు భాషల్లోకి తర్జుమా అయ్యింది.

Telugu Beggar, Cmbudda, Ira Basu, Ira Basu Path, Bengal Cm, Bengal, Sister-Lates

దీంతో ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది.తాజాగా టీచర్స్ డే రోజున కొందరు ఆమెను పిలిచి సత్కరించారు.అక్కడ మాట్లాడిన మాటలు చాలా లోతుగా ఉన్నాయి.చాలా మంది టీచర్లు, విద్యార్థులు తనని గౌరవిస్తారని చెప్పింది.అంతకు మించి అభిమానిస్తాని చెప్పింది.తనను చూసి కన్నీరు పెట్టుకుంటారని వెల్లడించింది.

కానీ తన జీవితం ఇంతే అని చెప్పింది.అంటే తనకు తెలిసే ఇలా జీవిస్తుంది ఇరాబాయి.

తాజాగా ఆమెను అధికారులు ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆమెను ఓ ఆశ్రమంలో చేర్పిస్తామని చెప్పారు.

కానీ తను అక్కడ ఉంటుందా? అనేది అసలు ప్రశ్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube