టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇప్పటికే చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ దర్శకులతో కూడా పలు సినిమాలకు సైన్ చేసాడు.బిజీ లైఫ్ లో ఉన్న రామ్ చరణ్ ఇటీవలే తన చెల్లెలు తో కలిసి సందడి చేశాడు.
మెగా ఫ్యామిలీ నుండి ప్రతి ఒక్కరు సెలబ్రేట్ హోదాను అందుకున్న వాళ్ళే.మెగాస్టార్ చిరంజీవి నుండి వైష్ణవ్ తేజ్ వరకు ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు.
ఇక ఈ ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా కొణిదెల నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.కానీ హీరోయిన్ గా అంత క్రేజ్ అందుకోలేకపోయింది.ఇక మెగా ఫ్యామిలీలో ఏ చిన్న పార్టీ జరిగిన ప్రతి ఒక్కరు హాజరవుతారు.పైగా ఆ చిన్న పార్టీ ని పెద్ద పండుగలా చేసుకుంటారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తన షూటింగ్ ను పూర్తి చేసుకోగా కాస్త సమయాన్ని తన చెల్లెళ్లతో గడిపాడు.
అందులో కొనిదెల నిహారిక, సుష్మిత, శ్రీజ ఉండగా వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక వీళ్ళు హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో కలిసి లంచ్ చేయగా వీళ్లు కెమెరాకు చిక్కారు.ఈ ఫోటోను చూసిన చరణ్ అభిమానులు తెగ లైక్ లు కొడుతున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.