టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.పుష్ప సినిమా షూటింగ్ ను శరవేగంగా నిర్వహిస్తున్న సమయంలో సుకుమార్ కు డెంగ్యూ ఫీవర్ వచ్చిందట.
దాంతో ఆయన్ను అత్యవసరంగా ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్యంకు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఆరోగ్యం పూర్తిగా నయం అయ్యింది.ఆయన డెంగ్యూ నుండి కోలుకున్నారు.
అయితే కాస్త నీరసంగా ఉండటంతో పాటు ఒల్లు నొప్పులుగా ఉంటున్న కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైధ్యులు సూచించారట.కనీసం రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఆయన మళ్లీ పుష్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట.
సుకుమార్ హెల్త్ గురించి ఆందోళన చెందుతున్న వారు ఈ విషయం బయటకు రావడంతో కాస్త ఊరట చెందుతున్నారు.
ఆయన సినిమా షూటింగ్ లు మరియు ఇతరత్ర కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నాడు.అందుకే పని ఒత్తడి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తినట్లుగా సమాచారం అందుతోంది.
సుకుమార్ పూర్తి ఆరోగ్యంగా అయిన తర్వాత మాత్రమే పుష్ప సినిమా షూటింగ్ పునః ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
పుష్ప సినిమా ను ఈ ఏడాదిలో విడుదల చేయాలని మొదట భావించారు.కాని కరోనా సెకండ్ వేవ్ ఇతర కారణాల వల్ల సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమా షూటింగ్ లేక పోవడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో అలా చక్కర్లు కొడుతున్నాడు.
ఇతర యూనిట్ సభ్యులు కూడా పూర్తిగా విశ్రాంతి మూడ్ లో ఉన్నారు.వచ్చే నెలలో పుష్ప సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉందట.