అమ్మ బాబోయ్ ఎక్కడైనా బాంబులు పేలుతాయని తెలుసు కానీ.కోడి గుడ్లు పేలుతాయని ఎప్పుడైనా విన్నారా.
విని ఉండరు.ఎందుకంటే ఇంత వరకు ఇలాంటి ఘటన జరిగి ఉండదు.
ఇటీవల ఒక మహిళకు ఇలాంటి ఘటన ఎదురైంది.ఆమె ఇంట్లో కోడిగుడ్డు బాంబు పేలినట్టు పేలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ ఘటన ఎలా జరిగిందా అని అనుకుంటున్నారా.అసలు ఏం జరిగిందంటే.
ఈ ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది.అక్కడే నివసిస్తున్న కాన్వే అనే మహిళ కోడి గుడ్లను మైక్రో వేవ్ లో ఉడికించేది.కానీ అక్కడే ఆమె పొరపాటు చేసింది.తొందరగా ఉడుకు తాయని కొన్ని రోజులుగా ఆమె మైక్రో వేవ్ లోనే ఉడికిస్తుంది.
అయితే ఇలా రోజు చేస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆ మైక్రో వేవ్ లో పెట్టిన కోడి గుడ్లు పేలాయి.దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఈ ఘటనలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి.ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.
![Telugu Eggs Microwave, Eggs Explode, Eggs, Egg Hack-Latest News - Telugu Telugu Eggs Microwave, Eggs Explode, Eggs, Egg Hack-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/07/Woman-Left-With-Burns-After-Egg-Poachings-Hack-Go-Wrong.jpg )
మైక్రో వేవ్ లో కేవలం 10 సెకన్ల లోనే కోడి గుడ్లు ఉడుకుతాయని అందుకే ఆమె అందులోనే ఉడికించడానికి మొగ్గు చూపిస్తుంది.రోజులాగే ఆ రోజు కూడా ఒక గడు గిన్నెలో వాటర్ పోసి గుడ్లు వేసి మైక్రో వేవ్ లో పెట్టింది.10 సెకన్ల తర్వాత ఆ గుడ్లను నేతకు తీసింది.
ఆ గిన్నెలో ఉన్న గుడ్లను బయటకు తీసేందుకు ఒక స్పూన్ ఉంచింది.
![Telugu Eggs Microwave, Eggs Explode, Eggs, Egg Hack-Latest News - Telugu Telugu Eggs Microwave, Eggs Explode, Eggs, Egg Hack-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/07/Woman-Left-With-Burnss-After-Egg-Poaching-Hack-Go-Wrong.jpg )
దాంతో ఒక్కసారిగా గుడ్డు తాకగానే ఒక్కసారిగా అవి పేలాయి.ఆలా గుడ్లు పేలడంతో ఆమె మీద ఆ గిన్నెలో ఉన్న వేడి నీళ్లు పడి ముఖం, మెడ కాలిపోయాయి.దీంతో ఆమె గాయాలపాలయ్యింది.ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.మైక్రో వేవ్ లో కోడిగుడ్లు పెట్టి ఉడికించడం వల్ల పేలుడు జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అందుకే కోడిగుడ్లను ఎప్పుడు ఒవేన్ లో పెట్టకూడదని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.