భారత్ లో సెకండ్ వేవ్ ఉదృతి మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్నా భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళే వారిపై ఆయా దేశాలు ఆంక్షల సడలింపులో మాత్రం చిన్న చూపు చూస్తున్నాయి.అమెరికా తాజాగా అత్యవసర అలాగే, విద్యార్ధి వీసా లకు మాత్రమే కొన్ని నిభంధలనతో కూడిన అనుమతులు ఇస్తోంది.
అలాగే వివిధ దేశాలు అన్నీ వారి వారి నిభంధనలకు అనుగుణంగా భారతీయులకు అనుమతులు ఇస్తున్నాయి.ఈ క్రమంలోనే భారత్ నుంచీ అత్యంత ఎక్కువగా వలస కార్మికులు వెళ్ళే దేశం అబుధాబి తాజాగా తమ దేశం వచ్చే వారిపై పెట్టిన నిభందనలు సడలించింది.
అయితే ఈ నిభందన సడలింపు ఇచ్చిన దేశాలలో భారత్ లేకపోవడంతో భారతీయులకు షాక్ అనే చెప్పాలి.అబుధాబి ప్రభుత్వం మే నెలలో గ్రీన్ లిస్టు జాబితాను ప్రకటించింది.
గ్రీన్ లిస్టు అంటే ఈ లిస్టు లో ఉండే దేశాలు అబుధాబి విధించిన క్వారంటైన్ నిభందనలు పాటించాల్సిన అవసరం లేదు.అయితే ఈ లిస్టు లో ఉన్న దేశాలు అబుధాబి చేరుకున్న తరువాత విమానాశ్రయం లో ఏర్పాటు చేసిన కరోన టెస్ట్ కేంద్రాలలో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
అలాగే కరోనా వ్యాక్సిన్ పూర్తిగా తీసుకున్న వారు మాత్రం అబుధాబి వెళ్ళిన ఆరు రోజుల తరువాత మరో సారి కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని.

అలాగే కరోనా టెస్ట్ ఒక డోస్ మాత్రమే తీసుకున్న వారు 12 రోజులు గడించిన తరువాత మరో సారి కరోనా టెస్ట్ ఆయా కేంద్రాలకు వెళ్లి చేయించుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది.ఇదిలాఉంటే గ్రీన్ లిస్టు దేశాలుగా పలు పేర్లు ప్రకటించిన అబుధాబి ఈ జాబితాలో మాత్రం భారత్, బ్రిటన్ పేర్లు చేర్చక పోవడం గమనార్హం.దాంతో గతంలో అబుధాబి భారత్ విషయంలో ఎలాంటి నిభందనలు అనుసరించిందో అవే నిభందనలు మరి కొన్ని రోజులు ఉండనున్నాయని తెలుస్తోంది.