ది ఫ్యామిలీ మ్యాన్‌ విడుదల పై కొనసాగుతున్న సస్పెన్స్‌

హిందీ సూపర్‌ హిట్ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు గత ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్నారు.ఉత్తరాది ప్రేక్షకులకు తోడు ఈసారి దక్షిణాది ప్రేక్షకులు కూడా ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు.

 The Family Man 2 Streaming Date,latest Movie News-TeluguStop.com

సమంత కీలక పాత్రలో నటించడం వల్ల ఈ సారి వెబ్‌ సిరీస్ సౌత్‌ లో పిక్క క్రేజ్‌ ను కలిగి ఉంది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కు సంబంధించిన స్ట్రీమింగ్‌ డేట్‌ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు.

కాని టెక్నికల్‌ ఇష్యూల కారణంగా వాయిదా వేశారు.ఎట్టకేలకు వెబ్‌ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈసారి అయినా స్ట్రీమింగ్‌ అవుతుందా అంటే కష్టమే అన్నట్లుగా నెటిజన్స్ నుండి స్పందన వినిపిస్తుంది.జూన్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా గత నెలలో ప్రచారం చేశారు.

కాని తమిళ ప్రేక్షకుల నుండి వస్తున్న వ్యతిరేకత విషయంలో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది.అందుకే స్ట్రీమింగ్‌ విషయంలో ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వివాదం ముదరకుండా ఉండేందుకు అని ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 మేకర్స్‌ సైలెంట్‌ గా ఉన్నారు.ప్రమోషన్‌ విషయంలో కూడా పెద్దగా హడావుడి చేయడం లేదు.

ఎక్కడ చూసినా కూడా వెంటనే తమిళనాడకు చెందిన వారు ఏకి పారేస్తున్నారు.దాంతో మళ్లీ మళ్లీ ఆ వివాదాన్ని మీడియాలోకి తీసుకు రావడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో కొత్త గా మళ్లీ మీడియా ముందుకు వచ్చేందుకు సిద్దంగా లేరు.

ఈ సమయంలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌ 2 కు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీ విషయంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.జూన్‌ లోనే ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాని కొందరు మాత్రం వాయిదా వేసేందుకు అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 స్ట్రీమింగ్‌ ఎప్పుడు అనేది మళ్లీ అధికార ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube