ప్రసుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా.? అంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమేనని చెప్పాలి.క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.మరి ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందో లేదో అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేశారు.
తల్లి కౌగిలిలో రకుల్ ఉండగా ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ అక్కడ మాత్రం బాగానే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
బాలీవుడ్ లో రకుల్ నటించే సినిమాలు హిట్టైతే అక్కడ రకుల్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో ఏ టాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రకుల్ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రకుల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు వస్తాయో రావో చూడాల్సి ఉంది.మరోవైపు వైష్ణవ్ తేజ్ రకుల్ సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయో ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది.