టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా తన ఇమేజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ.ఆర్ఎక్స్ 100 చిత్రంలో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ హీరో, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే కార్తికేయ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘చావు కబురు చల్లగా’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమా తరువాత కార్తికేయ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ హీరోపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కన్నేసినట్లు తెలుస్తోంది.
ఈ హీరో నటించిన సినిమాలను ఆయన చూసి కార్తికేయతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన దక్షిణాదిలో తీయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌లో ఒక సినిమాను ఖచ్చితంగా కార్తికేయ హీరోగా తెరకెక్కించాలని బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం బోనీ కపూర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన వకీల్ సాబ్ చిత్రంతో టాలీవుడ్‌లో గ్రాండ్ విక్టరీ అందుకోవాలని చూస్తున్న బోనీ కపూర్, దక్షిణాదిలో తన నెక్ట్స్ చిత్రాన్ని కార్తికేయతో తెరకెక్కించాలని చూస్తుండటంతో, ఈ హీరోకు లక్కీ ఛాన్స్ దొరికినట్లే అంటున్నారు ఆడియెన్స్.
ఇక ఆయన నటిస్తున్న చావు కబురు చల్లగా చిత్రంలో బస్తీ బాల్రాజు అనే మాస్ పాత్రలో కార్తికేయ కనిపిస్తుండగా, అందాల భామ లావణ్య త్రిపాఠీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను పెగళ్లపాటి కౌశిక్ డైరెక్ట్ చేస్తుండగా GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.