తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు టిఆర్‌ఎస్ పార్టీలో కేసిఆర్ తర్వాత కేసిఆర్ అంత పేరుగల వ్యక్తి.మంత్రిగా సిద్దిపేట ప్రజలకోసం ఎన్నో మంచి పనులు చేశాడు.
తాజాగా ఆయన ఓ అనాథ బాలిక ను చేరదీసి చదువు చెప్పించి ఆమె అభీష్టం మేరకు పెళ్లి కూడా చేశాడు. చిన్న కోడూరు మండలం, కస్తూరి పల్లి కి చెందిన భాగ్య, తల్లి తండ్రులు చనిపోవడంతో ఆమె అనాథ గా మిగిలిపోయింది.
ఆ విషయం తెలుసుకున్న హరీష్ రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి కు చెప్పి ఆమె చదువు, ఉపాధి మనమే చూసుకుందాం అని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఉన్న బాల సదన్ లో ఆమె ఉండటానికి వసతి కల్పించి, బాలల రక్షణ విభాగంలో ఉద్యోగం కల్పించాడు.
ఆ తర్వాత ఆమె అంగీకారం మెరకు ఇంబ్రహీంనగర్ లో టిఫిన్ సెంటర్ నడపుతున్న రాజు కి ఇచ్చి వివాహం జరిపించాడు.
వీరి వివాహానికి పెళ్లి పెద్దగా వ్యవహరించిన హరీష్ రావు తమ ఇంట్లో పెళ్లిగా భావించి నూతన వదువు వరులను ఆశీర్వదించాడు.ఈ వివాహ వేడుకలో జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
బాల సదన్ లోని చిన్నారులు ఆట పాటలతో సందడి చేశారు.