సర్వే: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యువత కరుణ ఎవరిపైన..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా ఒక వారం మాత్రమే వ్యవధి వుంది.ఈ నేపథ్యంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

 Young Americans To Vote In 'higher' Numbers, Joe Biden's Favourability Increases-TeluguStop.com

ఇప్పటికే ముందస్తు పోలింగ్ సైతం జరుగుతోంది.అయినప్పటికీ ఎవరు గెలుస్తారు, జనం నాడి ఎలా వుంది అన్న దానిపై సర్వేలు, అధ్యయనాలు వెలువడుతూనే వున్నాయి.

ఇప్పటి వరకు వెలువడిన అన్ని సర్వేల్లోనూ డెమొక్రాటిక్ నేత జో బిడెనే ముందంజలో వున్న సంగతి తెలిసిందే.

ఇక ఏ దేశంలోనైనా, ఏ ఎన్నికల్లోనైనా కీలకపాత్ర పోషించేది యువతే.

వారిని ఆకట్టుకున్న వారే విజయం సాధిస్తారన్నది కాదనలేని వాస్తవం.ఇక అమెరికా విషయానికి వస్తే… ఈ సారి అగ్రరాజ్యపు యువత ఎన్నికల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట.

వీరిలో అత్యధికులు బిడెన్‌ వైపే మొగ్గుచూపున్నారట.హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్.

అమెరికా వ్యాప్తంగా యువ ఓటర్లపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ప్రధానంగా 18-29 ఏళ్ల వయస్కులపై చేసిన ఈ సర్వేలో ఓటు వేసేందుకు గాను గత కొన్ని దశాబ్ధాల్లో ఎప్పుడూ లేనంత ఆసక్తిగా వారు ఎదురుచూస్తున్నారట.

63 శాతం మంది యువత తాము తప్పక ఓటు వేస్తామని స్పష్టం చేశారు.2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 47 శాతం మంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.గతంతో పోలిస్తే యువత 16 శాతం పెరిగే అవకాశం వుందని సర్వేలో తేలింది.జో బిడెన్ పట్ల యువతలో ఆదరణ పెరుగుతోందని.ఇది గత కొన్ని నెలలుగా మరింత ఊపందుకుందని సర్వేలో తేలింది.మొత్తం మీద చూస్తే 56 శాతం యువ ఓటర్లు బిడెన్ వైపే మొగ్గు చూపుతున్నారని హార్వర్డ్ సర్వే స్పష్టం చేసింది.ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా చేసిన అనుభవం.1972 నుంచీ 6 సార్లు సెనెట్‌కు ఎన్నికకావడం, హింసకు, మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా కీలక చట్టాలు తేవడంలో నాడు కీలక పాత్ర వంటి అనేక అంశాలు యువతలో బిడెన్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదం చేశాయని నిపుణుల అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube