అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ విమర్శలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.ట్రంప్ అధికారంలోకి రాకుండా చేయడానికి డెమోక్రటిక్ పార్టీ చేయని ప్రయత్నం లేదు.
ట్రంప్ చేసిన తప్పులు ఎత్తి చూపుతూ అమెరికా ప్రజలముందు ట్రంప్ ని బూచి చేసి, ద్రోహిగా మలిచి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోంది.తన పార్టీలోని కీలక నేతలు అందరితో ఇప్పటికే ట్రంప్ పై ఆరోపణలు చేయించిన డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక అయిన కమలా హారీస్ తో వరుసగా విమర్శలు చేయిస్తోంది…తాజాగా
ట్రంప్ ఓ మోసకారి, అమెరికా ప్రజలను మోసం చేసిన ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రపంచ ఆరోగ్యం సంస్థ కంటే ముందుగానే కరోనా గురించి ట్రంప్ కి తెలుసంటూ పెద్ద బాంబు పేల్చింది.
ఆమె చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వర్గంలో కలవరం పుట్టిస్తున్నాయి.వైరస్ ప్రభావం గురించి నిఘావర్గాలు ట్రంప్ కి ఫిబ్రవరి లోనే నివేదిక ఇచ్చాయని, కానీ ట్రంప్ పట్టనట్టుగా వ్యవహరించారని, ఈ సంచారం నిజమేనంటూ అధికారులు సైతం వెల్లడించారని కమల హారీస్ అన్నారు.ఇదిలాఉంటే
ఫిబ్రవరి 7 వ తేదీన ఫుడ్ వార్డ్ కు ట్రంప్ ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూ లో కరోనా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని ట్రంప్ చెప్పినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది…అమెరికాలో ఎంట్రీ ఇవ్వదానికంటే ముందుగానే ట్రంప్ కి వైరస్ గురించి తెలిసినా ప్రజా ఆరోగ్యం విషయంలో పూర్తి అశ్రద్ద వహించారని, ఫలితంగా లక్షలమంది అమెరికన్స్ చనిపోయారని వారి చావుకు పరోక్షంగా కారణం ట్రంప్ అని వాషింగ్టన్ పోస్ట్ తన కధనంలో పేర్కొంది.ఈ కధనాలు ఆధారంగా కమల హారీస్ ట్రంప్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
ట్రంప్ ముందుగానే మేల్కొని ఉండిఉంటే ఇతమంది అమెరికన్స్ తమ కుటుంభ సభ్యులని కోల్పోయే వారు కాదని అన్నారు.
.