టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం కరోనా నుండి కోలుకుని పూర్తి విశ్రాంతి మూడ్‌లో ఉన్నాడు.ఇటీవలే ప్లాస్మా దాతలకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
త్వరలో తాను ప్లాస్మా దానం చేస్తానంటూ రాజమౌళి ఇటీవలే ప్రకటిచిన విషయం తెల్సిందే.జక్కన్న ప్రస్తుతం ఫామ్ హౌస్‌లో ఉన్నాడు.
ఈ సమయంలో ఆయన ఒక జాతీయ మీడియా సంస్థతో చిట్ చాట్ చేశారు.ఆన్ లైన్ ద్వారా వారి చిట్ చాట్ సాగింది.
ఆ చిట్ చాట్‌లో రాజమౌళి మాట్లాడుతూ తన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి మరియు పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. సెప్టెంబర్ లో థియేటర్లు ఓపెన్ చేస్తే ప్రేక్షకులు వస్తారని మీరు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కొందరు మునుపటి మాదిరిగా మళ్లీ థియేటర్‌కు ప్రేక్షకులు రాకపోవచ్చు అంటున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఖచ్చితంగా జనాలు భారీ ఎత్తున థియేటర్లకు వస్తారు.థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే ఒకింత ఎక్కువ మందే క్యూ కడతారనే నమ్మకంను రాజమౌళి వ్యక్తం చేశారు.
![Telugu Corona, Rajamouli, Theaters, Ott, Rajamuli Rrr, Ram Charan-Latest News - Telugu Corona, Rajamouli, Theaters, Ott, Rajamuli Rrr, Ram Charan-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2020/08/tollywood-producers-waiting-Movie-theaters-open.jpg)
ఓటీటీకి ఆధరణ పెరిగిన నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు రారు అనుకుంటున్న సమయంలో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఆయన చాలా నమ్మకంతో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్‌ను వచ్చే రెండుమూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.