కరోనా కారణంగా గత మూడు నెలలుగా సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యిందే లేదు.దేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది.
షూటింగ్స్ త్వరలో ప్రారంభం అవ్వబోతున్నా థియేటర్లు మాత్రం ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.పలు సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు వెళ్తుంటే మరికొన్ని సినిమాల మేకర్స్ మాత్రం థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారు.
కొన్ని సినిమాలు విడుదల ముంగిట నిలిచి పోయాయి.వాటిని కొనుగోలు చేసిన బయ్యర్లు తల పట్టుకున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘మాస్టర్’ను బయ్యర్లు ఏకంగా 200 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.నిర్మాతలు లాభాలకు సినిమాను అమ్ముకున్నారు.ఇప్పుడు సినిమా విడుదల అయ్యే పరిస్థితి లేకపోవడంతో తాము చెల్లించిన అడ్వాన్స్‌లను తిరిగి ఇవ్వాల్సిందిగా బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పట్లో సినిమాను విడుదల చేయమని మాస్టర్ మేకర్స్ చెప్పారు.
కనుక దాదాపుగా సగం మొత్తంను అడ్వాన్స్ కట్టిన వారు తమకు సినిమా వద్దు డబ్బులు ఇవ్వండి అంటున్నారట.
ఈ విషయం విజయ్ వద్దకు కూడా వెళ్లింది.
నిర్మాతలతో మాట్లాడి తాము చెల్లించిన డబ్బును ఇప్పించాలంటూ వారు కోరారట.అందుకు విజయ్ తాను నిర్మాతలతో మాట్లాడుతాను అంటూ చెప్పాడట.
ఈ విషయంలో విజయ్ ఎటు వైపు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది.నిర్మాతలు సినిమాకు వచ్చిన డబ్బును తిరిగి వెనక్కు ఇచ్చే పరిస్థితిలో లేరు.
ఆ మొత్తంను ఇప్పటికే నిర్మాణంకు ఖర్చు చేశారట.దాంతో బయ్యర్ల మద్య విజయ్ నలిగి పోతున్నట్లుగా తమిళ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.