సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీల అసలు రూపాలు ఏంటి అనేది చాలా మంది తెలుసుకుంటున్నారు.అలాగే కరోనా లాంటి కష్టం కాలంలో మరింతగా బోధపడుతుంది.
నిజమైన హీరోలు ఎవరు, మనం అభిమానించే హీరోలు అసలు రూపం ఏంటి అనే విషయాలని గ్రహిస్తున్నారు.దీంతో కష్టకాలంలో ప్రజలకి అండగా ఉండే హీరోలకి సోషల్ మీడియాతో ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
వారి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎక్కువ మందికి వారి గొప్పతనం చేరే విధంగా చేస్తున్నారు.అలా ఇప్పుడు సోషల్ మీడియాలో లాక్ డౌన్ టైం లో సోషల్ ఐకాన్ గా సోనూసూద్ మారిపోయాడు.
సినిమాలకి కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ అవకాశం దొరికినపుడు ప్రభుత్వాన్ని నిందించడం తప్ప కష్టంలో ఉన్న ప్రజలకి సాయం చేయడానికి ముందుకి రారని మరోసారి రుజువైంది.కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ టైంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వలస కార్మికులని కనీసం ఆడుకునే ప్రయత్నం బాలీవుడ్ లో లెజెండ్స్ గా చెప్పుకునే ఎవరూ చేయలేదు.
ఇక అక్షయ్ కుమార్ కోట్ల రూపాయిలు కష్టకాలంలో విరాళంగా ఇచ్చి నిజమైన హీరో అనిపించుకుంటే.సోనూ సూద్ వలస కార్మికులకి అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నాడు.
వలస కార్మికులను ఇళ్లకు చేర్చడం కోసం సోనూసూద్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి.కొన్ని వందల మందిని స్వగృహాలకు చేర్చాయి.
వలస కార్మికుల కోసం ఓ విమానాన్ని కూడా సోనూ సూద్ బుక్ చేశాడు.ఈ క్రమంలో సోషల్ మీడియాలోగానీ, ఇతరత్రాగానీ సోనూ పాపులారిటీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
సల్మాన్‌ఖాన్ పాపులారిటీని సోనూ సూద్ దాటేశాడు.గూగుల్‌లో సల్మాన్ కన్నా సోనూ సూద్ గురించే ప్రజలు ఎక్కువ సెర్చ్ చేశారని తెలిసింది.