రకుల్ ప్రీత్ సింగ్.ఈ పేరుతో ఆమెను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరితో కూడా నటించిన ముద్దుగుమ్మ ఈమె.తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది.అయితే ఉన్నట్లుండి ఈమెకు స్టార్డం తగ్గిపోయింది.ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో ఈమెకు ఆఫర్లు రావడం తగ్గాయి.తెలుగులో తగ్గడంతో తమిళంలో ప్రయత్నించింది.అక్కడ రెండు మూడు సినిమాలు వచ్చాయి.
అవి కూడా ఆగిపోయాయి.
![Telugu Rakul Tollywood, Rakul Bikini, Rakul, Rakul Bollywood-Movie Telugu Rakul Tollywood, Rakul Bikini, Rakul, Rakul Bollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2020/01/Rakul-Preeth-Singh-Photo-Talk.jpg)
ప్రస్తుతం హిందీలో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది.ఇలాంటి సమయంలో ఈ అమ్మడు చాలా ఫ్రీ టైంను గడుపుతున్నట్లుగా ఆమె సోషల్ మీడియా పేజీలను చూస్తుంటే అనిపిస్తుంది.ఎందుకంటే ఆమె ఎక్కువగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెడుతోంది.
ఆమె పోస్ట్‌లు కుర్రకారులో హీట్‌ను పెంచుతున్నాయి.తాజాగా ఈ ఫొటోను పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంది కదా.? అవకాశాలు లేనప్పుడు ఇలా విశ్రాంతి తీసుకోక ఏం చేస్తారు పాపం.