పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అనే సామెత అందరికీ తెలిసిందే.అయితే ఈ సామెతలోని రెండో వాఖ్యాన్ని మాత్రమే వాడుకలో పెట్టుకున్నారు బ్యాంకాక్‌కు చెందిన ఓ రెస్టారెంట్ వారు.
ఆ రుచి అందరికీ ఒకేలా ఉండాలని అనుకున్న వారు ఒకే పాత్రలో వంట చేస్తూ ఒకటి కాదు రెండు కాదే ఏకంగా 45 ఏళ్లుగా వడ్డిస్తున్నారు.
ఇందులో విశేషమేమిటి అనుకుంటున్నారా? 45 ఏళ్లుగా వారు వడ్డిస్తున్న పాత్రను 45 సంవత్సరాలుగా కడకపోవడమే.ఇన్ని సంవత్సరాల నుండి అదే పాత్ర పొయ్యిమీద ఉందట.అందులో బీఫ్ నూడుల్స్, నూడుల్స్ సూప్ వంటి వంటకాలను రుచికరంగా వండుతూ వినియోగదారులకు వడ్డిస్తున్నారట సదరు యాజమాన్యం.
ఆ రెస్టారెంట్లో వడ్డించే సూప్, నూడుల్స్ రుచికరంగా ఉన్నాయంటూ ఆవురావురుమంటూ కుమ్మేస్తున్నారట తినడానికి వచ్చినవారు.
ఇక ఇదేదో బాగుందని సదరు రెస్టారెంట్ వారు కూడా అదే పాత్రలో వడ్డిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు.
ఏదేమైనా పాచి పాత్రలో వంట చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటున్న బ్యాంకాక్ వారి తెలివికి జోహార్లు చెప్పక ఉండలేం.