క్రికెట్ లో ఫార్మాట్ ఏదైనా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో ఆడుతూ దూసుకుపోతుంటాడు. ప్రస్తుతం యువీ అంతర్జాయతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికినా ఐపీయల్, టీ10 లీగ్ వంటి పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో ఆడుతున్నాడు.
అయితే గత కొంతకాలంగా ఫామ్ లో లేని సమస్య కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఈ ప్రభావం ఐపీయల్ వేలంలో తన రేటుపై పడింది.
అయితే 2015వ సంవత్సరంలో యువరాజ్ సింగ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది.ఇప్పటి వరకూ జరిగిన అన్ని సంవత్సరాల ఐపీయల్ వేలంలో ఇదే అత్యధిక ధర.ఇప్పటి వరకూ ఈ ధర రికార్డును ఎవరూ అందుకోలేదు.అయితే తాజగా ఆస్ట్రేలియన్ పేసర్ ఫ్యాట్ కమ్మిన్స్ ని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అత్యధికంగా 15.50 కోట్లు వెచ్చించి కొనుక్కుంది.
అయితే వేలం జరిగే సమయంలో అందరూ యవరాజ్ సింగ్ రికార్డుని ఫ్యాట్ కమ్మిన్స్అందుకుంటాడని అనుకున్నారు.కానీ ఫ్యాట్ కమిన్స్ యువరాజ్ రికార్డుకు 50.లక్షల దూరంలోనే నిలిచిపోయాడు.దీంతో ఈ సంవత్సరం కూడా యువరాజ్ రికార్డుని ఎవరూ అందుకోలేక పోయారు.
అయితే యువరాజ్ కి ఉన్న నిల్కడలేమితో సమస్య కారణంగా అతడి రేటు ప్రతీ ఏడాది అంతకుఅంత తగ్గిపోతోంది.2015వ సంవత్సరంలో అత్యధికంగా 16 కోట్లు పలికిన యువరాజ్, 2016వ సంవత్సరంలో అమాంతం సగానికి సగం 7కోట్లకి, 2018వ సంవత్సరంలో 2కోట్లకి, 2019 వ సంవత్సరంలో 1కోటి రూపాయలకి పడిపోయాడు, ఇది ఇలాగె కొనసాగితే భవిష్యత్తులో యువీ కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
.