రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అయిన గవర్నర్ కు అవమానం ఎదురైంది.సీఎం,మంత్రులు,ప్రభుత్వ అధికారులు ఎవరైనా కూడా ఆయన తరువాతే.
అలాంటి ఆయన కు అసెంబ్లీ వేదిక గా దారుణ అవమానం చోటుచేసుకుంది.ఆయనను శాసన సభ లోకి రానీయకుండా తాళం వేసి అవమానించారు సిబ్బంది.
పశ్చిమ బెంగాల్ లో చోటుచేసున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది.వివరాల్లోకి వెళితే….
ఈ రోజు పశ్చిమ బెంగాల్ స్పీకర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ధనకర్ ని మీటింగ్‌కు ఆహ్వానించారు.అయితే, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ అసెంబ్లీ గేటు నంబరు 3 నుంచి లోపలికి వెళ్లేందుకు రెడీ కాగా, అక్కడున్న సిబ్బంది అప్పటికే గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు.
దీంతో గవర్నర్ తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తుంది.దీనితో ఆయన మీడియా తో మాట్లాడినప్పుడు మమతా సర్కార్ తీరుపై మండిపడ్డారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్య చరిత్రకు అవమానం చేసిందని,తనను అసెంబ్లీలోకి రానీయకుండా గేటుకు తాళం వేశారని చెప్పారు.
స్పీకర్ మీటింగ్ అని పిలిచి, చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.అయితే మరోపక్క పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా ఆయన ఆలస్యం చేస్తున్నారు అని మమతా సర్కార్ ఇలాంటి చర్యకు పాల్పడి ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.మరి ఈ ఘటనపై మమత సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.