తెలుగుదేశం పార్టీ తరపున గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందిన దేవినేని అవినాష్ కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.అయితే పార్టీ మారిన సందర్భంగా అవినాష్ టీడీపీ మీద పెద్దగా విమర్శలు ఏవీ చేయలేదు.
కార్యకర్తల ఒత్తిడి మేరకే తాను పార్టీ మారుతున్నాను అంటూ ఆయన ప్రకటించారు.ఇక వల్లభనేని వంశీ మాత్రం పార్టీకి రాజీనామా చేసినా వైసీపీలో చేరకుండానే టీడీపీ మీద విరుచుకుపడ్డారు.
ఇది ఇలా ఉండగా దేవినేని అవినాష్ కు ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జిగా ఆయన్ను నియమించారు.
ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు అవినాష్.
అందరినీ కలుపుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.